కోటపాడు,ఏప్రిల్05(ఆంధ్రపత్రిక):మండలంలోని లంకవానిపాలెం పి.హెచ్.సి.లో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ వైద్యాధికారిణి డాక్టరు శైలజపై సహచర వైద్యులు, సిబ్బంది డి.ఎం.అండ్ హెచ్.ఒ.కు ఫిర్యాదు చేశారు.డాక్టరు జాహ్నవి, ఆయుష్ వైద్యురాలు చంద్రవదన, ఏపీ ఎన్జీవోస్ కె. కోటపాడుతాలూకా యూనిట్ అధ్యక్షులు జవ్వాది సన్యాసిరావు(చిన్నా ), వైద్య సిబ్బంది సామూహికంగా మంగళవారం పీహెచ్సీ ఆవరణలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టరుశైలజ వైద్య సిబ్బందినుంచి లంచాల తీసుకుంటున్నారని, లంచం ఇవ్వనిదే సెలవులు మంజూరు చేయడంలేదని ఆరోపించారు. వివాహం నిమిత్తం సెలవు మంజూరు కోరితే రెండుసార్లు జిల్లా ఉత్తమ వైద్యాధికారిణిగా ప్రశంసలందుకున్న నాదగ్గర రూ.25,000లు లంచం డిమాండ్ చేశారని డాక్టరు జాహ్నవి చెప్పారు. హెచ్.వి.ముత్యవమ్మ అనారోగ్యంతో విధులు నిర్వహించలేనందున ప్రతినెలా రూ.10,000లు సమర్పించుకోవలసి వస్తుందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. స్టాఫ్ నర్స్, హెల్త్ సూపర్వైజర్లను,సిబ్బందిని అభ్యంతరకరపదజాలంతో దూషిస్తున్నారని తెలిపారు. హెచ్.డి.ఎస్.నిధులు స్వాహా చేస్తున్నారన్నారు.సిబ్బందిపై ఆమె కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నందుకు నిరసనగా బాధితులందరం మూకుమ్మడిగా సంతకాలుచేసి డి.ఎం.అండ్ హెచ్.ఒ.కుఫిర్యాదు చేసామని హెల్త్ సూపర్వైజర్ జవ్వాది సన్యాసిరావు(చిన్నా)తెలిపారు. ఈ విషయమై డాక్టరు శైలజను వివరణ కోరగా ఎవరిడ్యూటీవారిని చేయమంటే తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. తను ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన 143 జీవో ప్రకారం పని చేయమంటున్నానని డాక్టరు శైలజఅన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!