న్యూఢల్లీి,అక్టోబర్3 (ఆంధ్రపత్రిక): కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోరులో ప్రచార పర్వం ప్రారంభమైంది. బరిలో నిలిచిన ఇరువురు నేతలు శశిథరూర్, మల్లిఖా ర్జున్ ఖర్గేలు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖర్గే వ్యాఖ్యలపై శశిథరూర్ స్పందిం చారు. ఈ ఎన్నికలు కాంగ్రెస్లో మార్పుల కోసమని… కానీ ఖర్గే నాయకత్వంలో పార్టీలో యథాతథ స్థితిని, పాతపద్ధతులే కొనసాగు తాయని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక అనేది పార్టీలో అంతర్గతంగా జరిగే పోటీ కాదన్నారు. అయితే బిజెపిపై ఎంత సమర్థవంతంగా పోటీ ఉండాలనే దానిని నిర్ణయించేందుకు ఈ ఎన్నిక ఓ అవకాశమన్నారు. ఖర్గేకు, తనకు మధ్య ఎలాంటి సైద్దాంతిక విభేదాలు లేవని వెల్లడిరచారు. ఈ పోటీ పార్టీని ఎలా సమర్థవంతంగా నడుపుతా రన్న అంశంపై మాత్రమేనని అన్నారు. ’థింక్ టుమారో.. థిక్ థరూర్’ అని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఏకాభిప్రాయంతో పూర్తి కావాలని తాను ప్రయత్నించినా, థరూర్ మాత్రం పోటీనే కోరుకున్నారని ఖర్గే ఆదివారం వెల్లడిరచిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోటీ అవసరమని థరూర్ నిశ్చితాభిప్రాయంతో ఉన్నారని అన్నారు. పార్టీ అధ్యక్షునిగా తాను ఎన్నికైతే గాంధీ కుటుంబంతో, ఇతర సీనియర్ నేతలతో సంప్రదింపులు జరిపి, వారు చెప్పిన మంచి విషయాలు ఆచరిస్తానని పేర్కొన్నారు. అలాగని తాను గాంధీ కుటుంబ మద్దతు ఉన్న అధికారిక అభ్యర్థిని కాదని అన్నారు. బిజెపిపై పోరాడేందుకు నేతలంతా ఒక్కటై తనకు మద్దతు ఇస్తున్నారని చెప్పారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!