ఆతిథ్యం ఇచ్చి ఆత్మీయంగా పలకరించిన మోడీ
దేశం గర్వించేలా కీర్తి తెచ్చారని కితాబు
న్యూఢల్లీి,ఆగస్ట్13(ఆర్ఎన్ఎ): కామన్వెల్త్ క్రీడల పతక విజేతలకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో భారత అథ్లెట్లు చారిత్రక ప్రదర్శన చేసి దేశం గర్వించేలా చేశారని పేర్కొన్నారు. గెలుపొందిన క్రీడాకారులకు ప్రధాని మోడీ తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. వారితో కలిసి ముచ్చటించారు. ఇటీవలే కామన్వెల్త్ క్రీడలు 2022 ఘనంగా ముగిశాయి.ఈ ప్రతిష్ఠాత్మక క్రీడల పతక విజేతలకు.. ప్రధాని నరేంద్రమోదీ తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. వారిని ఆత్మీయంగా పలకరించారు. ప్రతిఒక్కరికీ అభినందనలు తెలిపారు. కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. ’కుటుంబసభ్యుల్లా విూరంతా ఇక్కడి రావడం నాకెంతో సంతోషంగా ఉంది. ముందుగా కామన్వెల్త్లో పాల్గొన్న ప్రతిఒక్కరికీ, మెడల్స్ సాధించినవారికి నా అభినందనలు అన్నారు. విూరంతా చారిత్రక ప్రదర్శన చేశారు. నాతో సహా దేశం మొత్తం గర్వపడేలా చేశారు. ఆత్మవిశ్వాసం, ధైర్యమే విూ గుర్తింపు. విూ కృషి, స్ఫూర్తిదాయక విజయంతో దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లోకి అడుగుపెట్టబోతుంది. గత కొన్ని వారాల ప్రయాణం చూస్తే.. క్రీడల్లో దేశం రెండు భారీ విజయాలను అందుకుంది. ఒకటి కామెన్వెల్త్లో చారిత్రక ప్రదర్శన చేసింది. రెండోది తొలిసారి చెస్ఒలింపియాడ్ను నిర్వహించింది. చెస్ ఒలింపియాడ్ను విజయవంతంగా నిర్వహించడమే కాకుండా మంచి ప్రదర్శనను కొనసాగించాం.వారికి కూడా నా అభినందనలు’ అని అన్నారు. కాగా, కామన్వెల్త్లో భారత్ నాలుగో స్థానంతో ముగించింది. మొత్తం 61 పతకాలు సాధించింది. ఇందులో 22 స్వర్ణపతకాలు సహా 16 రజతం, 23 కాంస్య పతకాలు ఉన్నాయి.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!