
విశాఖపట్నం, నవంబర్ 11 (ఆంధ్రపత్రిక):
దీపావళి సందర్భంగా విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ లో సుమారు 133 బాణాసంచా షాపులు ఏర్పాటు చేశారు. అయితే బాణాసంచా విక్రయ యదారులు క్యాజువల్ జిఎస్టి చెల్లించకపోవడంతో సిరిపురం సెక్షన్ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ప్రతి షాప్ కి జీఎస్టీ చెల్లించాలని నోటీసులు సర్వ చేస్తున్నారు. సాధారణంగా దీపావళి బాణాసంచా విక్రయించే ముందు కమర్షియల్ ట్యాక్స్ జీఎస్టీ చెల్లించాలి. మూడు రోజులుగా ఎదురుచూసిన కమర్షియల్ ట్యాక్స్ కార్యానికి వెళ్లకపోవడంతో సంబంధిత అధికారులు ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ చేరుకున్నారు. స్టాల్స్ లో ఉన్న స్టాకు సంబంధించి 18 శాతం జిఎస్టి చెల్లించిన తర్వాత అనుమతులు ఇస్తారు. అనుమతులు లేకుండా వ్యాపారాలు చేస్తుండడంతో శనివారం సెలవు దినం అయినప్పటికీ, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ఏయూ గ్రౌండ్ కి నోటీసులతో వచ్చారు. ప్రతి షాప్ కి నోటీసులు ఇచ్చి ఆఫీసుకి రావాలని తెలియజేసారు . ఈ కార్యక్రమంలో డిసిటిఓ ఆర్ వి డి ప్రసాదు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
దీనిపై సీటీవో వాడపల్లి జ్యోతి ని ఆంధ్రపత్రిక వివరణ కోరగా, అనువార్య కారణాలవల్ల తాము పాల్గొనలేకపోయానని, తమ సిబ్బంది నోటీసులు సర్వ చేస్తున్నారని తెలిపారు. విక్రయదారుల ఇన్వాయిస్, వేబిల్లులు పరిశీలించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీ వసూలు చేస్తామని తెలిపారు.