తేరీ రీమేక్ సన్నాహాల్లో డైరెక్టర్
డిసెంబర్ 09 (ఆధ్రపత్రిక): రెండు రోజుల ముందు ప్రకటించిన పవన్`సుజీత్ సినిమా ఎంత ట్రెండ్ అయిందో.. ఇప్పుడు పవన్`హరీష్ శంకర్ సినిమా అంతకంటే ఎక్కువే ట్రెండ్ అవుతుంది. అయితే సుజీత్ సినిమా పాజిటీవ్‌గా ట్రెండ్ అయితే, హరీష్ శంకర్ సినిమా మాత్రం నెగెటీవ్‌గా ట్రెండ్ అవుతుంది. దానికి కారణం కూడా లేకపోలేదు. కొన్ని నెలల క్రీతం హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్‌తో ’భవదీయుడు భగత్ సింగ్’ సినిమాను అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాకు ఎక్కువగా సమయం కేటాయించాల్సి ఉంటుంది. పవన్ ప్రస్తుతం ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరో వైపు రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. దాంతో ఈ ప్రాజెక్ట్‌కు బ్రేక్ పడిరది. ఆ తర్వాత హరీష్ వేరో హీరో కోసం వెతుకులాట మొదలు పెట్టాడని గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా హరీష్ శంకర్ తన తదుపరి సినిమాను పవన్‌తో చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే ఈ ప్రకటన పవన్ ఫ్యాన్స్‌ను భయపెడుతుంది. అదేంటి అనుకుంటున్నారా? హరీష్ శంకర్, పవన్‌తో ’భవదీయుడు’ ప్లేస్‌లో ’తేరి’ రీమేక్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఫ్యాన్స్ భయపడటానికి కారణం కూడా ఉంది. ’తేరి’ సినిమాను దిల్‌రాజు ’పోలీసోడు’ పేరుతో తెలుగులో రిలీజ్ చేశాడు. ఈ మూవీ దిల్‌రాజుకు లాభాలు తెచ్చిపెట్టకపోయినా.. ఇక్కడ బ్రేక్ఈవెన్ సాధించింది. ఆ తర్వాత ఈ సినిమా శాటిలైట్ హక్కులను స్టార్ మా ఛానల్ దక్కించుకుంది. కాగా ఈ సినిమా స్టార్ మా చానల్లో వారానికి రెండు సార్లు ప్రదర్శితమవుతుంది. ఈ సినిమాను ఇప్పటికే చాలా మంది వీక్షించారు. మొన్న వచ్చిన ’గాడ్‌ఫాదర్’ సినిమా కూడా తెలుగులో ఆల్రెడీ చూసిన ’లూసీఫర్’ సినిమానే. అయితే లూసీఫర్ సినిమా ఎక్కువ మందికి తెలియదు. ఎందుకంటే అది ఏ చానల్లోనూ ప్రసారం కాలేదు. కేవలం అమెజాన్‌లో మాత్రమే ఉంది. ఇన్ని అడ్వాంటేజ్ల మధ్య రిలీజైన సినిమానే బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అలాంటిది ’తేరి’ సినిమాను రీమేక్ చేస్తున్నాడంటే ఫ్యాన్స్ భయపడటానికి అర్ధం ఉంది. గతంలో కూడా ఇలానే అజిత్ నటించిన ’వీరుడోక్కడే’ సినిమాను ’కాటమరాయుడుగా’ రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నాడు. ఇవన్నీ పవన్ ఫ్యాన్స్‌లో ఆందోళనలు క్రియేట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ’వీ డోంట్ వాంట్ తేరీ రీమేక్’ అనే హ్యష్‌ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది. అంతేకాకుండా ఒక లేడీ ఫ్యాన్ తేరీ సినిమా రీమేక్ చేస్తే సూసైడ్ చేసుకుంటా అని నోట్ రాసింది. ప్రస్తుతం ఈ నోట్ సోషల్ విూడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే మరికొందరు మాత్రం పవన్ కంబ్యాక్ ఇచ్చిన ’గబ్బర్ సింగ్’ సినిమా కూడా ’దబాంగ్’కు రీమేక్‌గా తెరకెక్కిందే. హరీష్ ఎన్నో మార్పులు చేసి పవన్‌కు తగ్గట్టు కథను మార్చి బ్లాక్‌బస్టర్ సాధించాడు. అదే విధంగా ’గద్దలకొండ గణెళిష్’ కూడా అల్రేడీ తెలుగులో డబ్ అయిన ’చిక్కడు దొరకడు’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కిందే. కానీ హరీష్ తెలుగు నేటివిటీకి తగ్గట్లు మేజర్ మార్పులు చేసి సక్సెస్ అయ్యాడు. ఇక ఇప్పుడు ’తేరి’ సినిమాను కూడా మార్పులు చేసి తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు తెరెకెక్కిస్తాడని అంటున్నారు. ఇక పవన్ కూడా ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో రీమేక్ సినిమానే బెటర్ అని ’తేరి’ రీమేక్‌కు శ్రీకారం చుట్టాడని తెలుస్తుంది. మరీ దీనిపై హరీష్, శంకర్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.