CM Chandrababu: వరద సాయం ఏ మేరకు అందిందనే అంశంపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు.. ఇంకా సెటిల్ కాని క్లైమ్లను ఈ నెల 30వ తేదీలోగా సెటిల్ చేయాలని ఆదేశించారు..
ఈ నెల 30వ తేదీని డెడ్ లైన్‌గా పెట్టుకుని పని చేయాలన్నారు.. వరద ముంపులో దెబ్బతిన్న వాహనాల భీమా క్లెయిమ్‌ల చెల్లింపు, మరమ్మతులు, గృహోపకరణాల మరమ్మతులు, బ్యాంకు రుణాలు రీ షెడ్యూల్ పై చర్చ సాగింది.. 11 వేల వాహనాల క్లెయిమ్‌లు వచ్చాయని సీఎంకు తెలిపారు అధికారులు.. ఇప్పటికీ 6500 క్లెయిమ్‌లు పరిష్కరించామని అధికారులు తెలిపారు.. 5 వేలకు పైగా గృహోపకరణాల మరమ్మతులకు ఫిర్యాదులు వచ్చాయన్నారు.. ఎల్జీ, శాంసంగ్ కంపెనీలు త్వరితగతిన మరమ్మతులు చేయాలని ఆదేశించారు సీఎం.. వరద ముంపు ప్రాంతాల్లో నీటి కాలుష్యం కారణంగా అంటూ వ్యాధులు తలెత్తకుండా బయో టెక్నాలజీ వినియోగించినట్టు తెలిపారు వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు. ఫైరింజన్ల ద్వారా అగ్నిమాపక శాఖ 76,731 ఇళ్లను , 331 కిలోమీటర్ల మేర రహదారులను శుభ్ర పర్చినట్టు వెల్లడించారు సీఎం..
ఇక, బోట్లతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టించారు. బోట్ల వ్యవహరంలో కచ్చితంగా వైసీపీ కుట్ర ఉందని మండిపడ్డారు సీఎం చంద్రబాబు.. కనీస బాధ్యత లేకుండా ఆంబోతుల మాదిరి వ్యవహరించారు. అనంతపురంలో రథం కాల్చేసారు. బోట్ల విషయంలో కుట్ర పన్నిన వారిని అరెస్ట్ చేస్తాం. నేను అసమర్థుణ్ని కాను.. ఎవరు ఏం తప్పు చేసినా తెలిసేలా వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అన్నారు.. ఎవరైనా కుట్రలు పన్నితే ఖబ్డదార్ అంటూ హెచ్చరించారు.. ఇటీవల సంభవించిన విపత్తులో ప్రభుత్వం వైపు నుంచి ఎంత వరకు సాయం చేయాలో అంత వరకు చేశాం. నాలుగు లక్షల మందికి రూ. 602 కోట్లు అకౌంట్లో వేశాం. ఇప్పటి వరకు నేను చూడని విపత్తు ఇది. బుడమేరులో ఎప్పుడూ చూడని వరద. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో మోడ్రనైజేషన్ పనులు నిలిపేసింది. బుడమేరు కబ్జాకు గురైంది. మరో వైపు కృష్ణా నదిలో పెద్జ ఎత్తున వరద. ఇది ఆల్ టైమ్ రికార్డ్. ప్రకృతి ప్రకోపం.. లేదా ప్రకృతితో మనం ఆడుకున్నప్పుడో ఇలాంటి అకాల వరదలు వస్తున్నాయి. దీనికి తోడు గత పాలకుల పాపాలు కూడా వరద తీవ్రత పెరగడానికి తోడయ్యాయని దుయ్యబట్టారు సీఎం చంద్రబాబు..