హైదరాబాద్: రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యలను పరిష్కరించుకోవాలని ఎంపీ లక్ష్మణ్ కోరారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేంద్రం రెండు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. తిరుపతి పవిత్రతను కాపాడాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాస్తున్నట్లు చెప్పారు. తిరుమలలో అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడిందని ఆరోపించారు.
ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ కశ్మీర్ ప్రజలకు మోదీ రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వం మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిందని పేర్కొన్నారు. ముస్లింలకు భాజపా వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం చేసిందన్నారు. మతపరమైన రిజర్వేషన్లను మాత్రమే భాజపా వ్యతిరేకించిందని చెప్పారు. రిజర్వేషన్లు రద్దు, రాజ్యాంగాన్ని మారుస్తామని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసి లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందిందని లక్ష్మణ్ విమర్శించారు.