బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు రోజుల పాటు మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారు. సోలాపుర్, దారాశివ్ జిల్లాల్లో ఆయన పర్యటిస్తున్నారు. ప్రగతిభవన్ నుంచి రెండు బస్సులు, సుమారు 600 కార్ల భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్రకు వెళ్లారు.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు రోజుల పాటు మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారు. సోలాపుర్, దారాశివ్ జిల్లాల్లో ఆయన పర్యటిస్తున్నారు. ప్రగతిభవన్ నుంచి రెండు బస్సులు, సుమారు 600 కార్ల భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్రకు వెళ్లారు. ఈ పర్యటనకు వెళ్లినవారిలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీఆర్ఎస్ ముఖ్యనేతలు ఉన్నారు. నిన్న మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఉమెర్గా పట్టణంలో భోజనాలు చేసి.. అక్కడి నుంచి సోలాపూర్ చేరుకొని రాత్రి అక్కడే బస చేశారు. ఇక.. ఇవాళ ఉదయం 8 గంటలకు బయలుదేరి.. తొమ్మిదిన్నర గంటలకు పండరిపూర్‌లో ‘శ్రీ విఠల్ రుక్మిణి’ ఆలయాన్ని సీఎం కేసీఆర్, ఇతర ప్రజాప్రతినిధులు దర్శించుకుని పూజలు చేస్తారు. అక్కడి నుంచి ఉదయం పదకొండున్నర పండరిపూర్ మండలం సర్కోలీ గ్రామానికి చేరుకోనున్నారు. అక్కడ ఎన్సీపీకి చెందినసోలాపూర్ జిల్లా ప్రముఖ నేత భగీరథ్ భాల్కే సహా పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరనున్నారు.
ఈ సందర్భంగా అక్కడ నిర్వహించే సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. అక్కడే భోజనాలు ముగించుకొని.. మధ్యాహ్నం ఒకటిన్నరకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. అలాగే.. మార్గమధ్యలో మూడున్నరకు దారాశివ్ జిల్లా తుల్జాపుర్‌లోని ప్రముఖ శక్తిపీఠం ‘తుల్జా భవానీ’ అమ్మవారిని సీఎం కేసీఆర్, ఇతర ప్రజాప్రతినిధులు దర్శించుకోనున్నారు. దీంతో కేసీఆర్ మహారాష్ట్ర రెండు రోజుల పర్యటన ముగియనుంది. సాయంత్రం నాలుగున్నర గంటలకు బయలుదేరి రాత్రి పది గంటలకు ప్రగతిభవన్‌కు చేరుకోనున్నారు.అయితే కేసీఆర్ ఇంత భారీ ర్యాలీతో మహారాష్ట్ర వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.