తెలంగాణలో శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. తాను పోటీ చేయనున్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఆయన నామినేషన్ పత్రాలతో కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి సన్నిధిలో పూజలు నిర్వహించారు.
తెలంగాణలో శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. తాను పోటీ చేయనున్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఆయన నామినేషన్ పత్రాలతో కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి సన్నిధిలో పూజలు నిర్వహించారు. గజ్వేల్‌లో రెండు సెట్ల నామినేషన్లను రిటర్నింగ్ అధికారికి కేసీఆర్ సమర్పిస్తారు. గజ్వేల్‌లో నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అక్కడి నుంచి కేసీఆర్ నేరుగా కామారెడ్డి వెళ్తారు. అక్కడ నామినేషన్ సమర్పించిన తర్వాత బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. గజ్వేల్‌లో ఉదయం 11 గంటలకు.. కామారెడ్డిలో మధ్యాహ్నం ఒంటి గంటలకు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కాగా.. ప్రచారం చివరి రోజునగజ్వేల్లో సీఎం కేసీఆర్ సభ ఉంటుంది. 2014, 2018 ఎన్నికల్లో గజ్వేల్‌లోనే చివరి సభ నిర్వహించి ప్రచారానికి కేసీఆర్ ముగింపు పలికారు. అదే సెంటిమెంట్‌ను ఈ ఎన్నికల్లోనూ కేసీఆర్ అనుసరించబోతున్నారు.
సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ నామినేషన్ వేయనున్నారు. ఉదయం 11:45 నిమిషాలకు సిరిసిల్లా ఆర్డిఓ కార్యాలయంలో కేటీఆర్ నామినేషన్ వేయనున్నారు.. మంత్రి హరీష్ రావు కూడా ఇవాళే.. నామినేషన్ వేయనున్నారు. సిద్దిపేటలో హరీష్ రావు నామినేషన్ వేయనున్నారు.
ఇదిలాఉంటే.. నామినేషన్లకు ఇక కొద్దిగంటలే గడువు మిగిలి ఉండటంతో అన్ని పార్టీల నేతలు నామినేషన్లు సకాలంలో వేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నామినేషన్ వేయనున్నారు..ఇప్పటికే అయ్యప్ప స్వామి దేవాలయంలో నామినేషన్ పత్రాలకు భట్టి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఇవాళే నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే, ఆయన ఇంట్లో ప్రస్తుతం ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.