దివ్యాంగుడైన పెద్ది శ్రీనుకి పెన్షన్‌తో పాటు అతని భార్య పేరు మీద భూపట్టా, వైఎస్సార్ చేయూత, అమ్మ ఒడి ఇచ్చి వారి జీవితంలో వెలుగులు నింపినందుకు సంతోషంగా ఉందని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
ఇటువంటి లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపే అవకాశం కలిగినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.పెద్ది శ్రీను కుటుంబానికి మన ప్రభుత్వం పెద్ద దిక్కుగా నిలిచినందుకు గర్వపడుతున్నానని సీఎం జగన్ ట్వీట్‌లో పేర్కొన్నారు