- కుటుంబానికి పదిలక్షల పరిహారం ప్రకటన
- బాధిత కుటుంబాలకు తోడుగా నిలుస్తా
అమరావతి,అక్టోబర్29(ఆంధ్రపత్రిక):కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం దొంతుకుర్రు పాఠశాలలో విద్యుదాఘాతంతో విద్యార్థి చనిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి స్పందించారు. విద్యార్థులకు కరెంట్ షాక్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన బాలుడి కుటుంబానికి రూ.10 లక్షలు నష్ట పరిహారం ప్రకటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.లక్ష పరిహారం ఇవ్వడంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తోడుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. కాగా.. దొంతికుర్రులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యుదా ఘాతంతో ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలిస్తుండగా ఓ విద్యార్థి మృతి చెందాడు. వివేక్, సతీశ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరో ఇద్దరు విద్యార్థులు నిఖిల్, మహిధర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఇనుప ఊచలను మిషన్‌తో కోస్తుండగా విద్యుత్ సరఫరా అయింది. మంచినీరు తాగేందుకు వచ్చిన విద్యార్థులు ఊచలు పట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది