విశాఖకు తన క్యాంపు కార్యాలయాన్ని తరలించడం లో అధికారులు ఆలస్యం చేశారని ముఖ్యమంత్రి భావిస్తున్నారా? లేదంటే ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసుకొని ముఖ్యమంత్రి విశాఖకు వచ్చేయాలనుకున్నారా? అందుకే ఎందుకు ఇంటీరియర్ ఆలస్యం అవుతుంది! ట్రీ ప్లాంటేషన్ లాంటివి ఎందుకు సకాలంలో చేయలేకపోయారని ముఖ్యమంత్రి అధికారులను నిలదీశారా? గ్రీన్ మ్యాట్ ఎందుకు వేశారన్న ముఖ్యమంత్రి ప్రశ్నకు అధికారులు ఏం చెప్పారు? మరోవైపు విశాఖలో పర్యటించిన సీఎం ఓ షిఫ్టింగ్ కమిటీ ఎలాంటి నిర్ణయాలని తీసుకుంది ఈ స్టోరీ చూద్దాం..
ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయాన్ని విశాఖపట్నంకు మార్చాలని 2020లోనే నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత కొవిడ్ లాక్డౌన్ రావడం, రెండు సంవత్సరాల పాటు అలాంటి ఆలోచన చేయలేని పరిస్థితి. అనంతరం ముఖ్యమంత్రి విశాఖకి వచ్చే అంశం న్యాయస్థానాలకు వెళ్లడం, ఆ వివాదాలకు ఇంకా పరిష్కారం లభించకపోవడంతో మరి కొంతకాలం ఆలస్యం అయింది. అలా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎన్నికల నాటికి రాజధానిపై స్పష్టత ఇచ్చి ఎలక్షన్స్ కి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి విశాఖకి తన క్యాంప్ కార్యాలయం మార్చేయాలని ముఖ్యమంత్రి ఏడాది క్రితం గట్టిగా నిర్ణయించుకున్నారట.
ఎక్కడైనా ఉండే అవకాశం, వెసులుబాటు ఉండడంతో ముందుగా ముఖ్యమంత్రి తన నివాసాన్ని విశాఖ మార్చుకొని అక్కడి నుంచే పాలన సాగించాలని నిర్ణయించుకుని ఆ మేరకు అధికారులని సిద్ధం చేశారు. అయితే ఆ నిర్ణయం కూడా ఆలస్యం అవుతూ వస్తూ ఉండడంతో ముఖ్యమంత్రి తన అసహనాన్ని తాజాగా వ్యక్తం చేశారట. ఈనెల 16వ తేదీన ముఖ్యమంత్రి విశాఖకు వచ్చిన సందర్భంలో ఐటి హిల్స్ వద్ద ఏర్పాటు చేసిన హెలో పాడ్ లో దిగిన తర్వాత అక్కడే బీచ్ క్లీనింగ్ కోసం సిద్ధంగా ఉంచిన యంత్రాలను ప్రారంభించే సమయంలో జీవీఎంసీ అధికారులతో పాటు జిల్లా రెవిన్యూ అధికారులు అందరూ కలిసి ముఖ్యమంత్రిని కలిసే అవకాశం వచ్చింది. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి ఋషికొండ నిర్మాణాల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారట.
ఆ సమయంలో ముఖ్యమంత్రి జిల్లా అధికారుల పై ప్రశ్నల వర్షం కురిపించారట. క్యాంప్ కార్యాలయ నిర్మాణం ఎందుకు ఆలస్యం అవుతుంది అని ప్రశ్నించిన ముఖ్యమంత్రి కి ట్రీ ప్లాంటేషన్, బ్యూటిఫికేషన్ వర్క్స్, ల్యాండ్ స్కేపింగ్ లాంటివి పెండింగ్ ఉన్నాయని అధికారులు చెప్పారట. ఆ సమయంలో ట్రీ ప్లాంటేషన్ కోసం అంత సమయం తీసుకుంటారా? ఇంటీరియర్ కూడా ఎందుకు ఆలస్యం అవుతుంది? మీరు పూర్తి చేసి ఉంటే విజయదశమికి విశాఖకు వచ్చేసే వాడినని, విధిలేని పరిస్థితుల్లోనే నిర్మాణాలు పూర్తయ్యేదాకా ఆగాల్సి వస్తుందని ముఖ్యమంత్రి అధికారులతో అనడం తో అధికారులకు నెత్తుటి చుక్క లేదట. అదే సమయంలో మున్సిపల్ అడ్మిన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి జోక్యం చేసుకుంటూ అధికారులపై సున్నితంగా ఆగ్రహం వ్యక్తం చేసిందట.
ఆ విషయం కూడా ప్రస్తవించిన సీఎం..
అధునాతన యంత్రాలని అందుబాటులోకి తెచ్చుకొని పనులు పూర్తి చేయకుండా ఆలస్యం చేస్తున్నారంటూ హెచ్చరించిన ఆమె అవసరమైతే తాను దగ్గరుండి పూర్తి చేస్తానంటూ ముఖ్యమంత్రి కి హామీ ఇచ్చారత.అదే సమయంలో గతంలో వివాదాస్పదంగా మారిన రుషికొండ కు గ్రీన్ మ్యాట్ అంశాన్ని కూడా ప్రస్తావించారట ముఖ్యమంత్రి. అసలు గ్రీన్ మ్యాచ్ ఎందుకు వేశారని ముఖ్యమంత్రి అధికారులని అడిగారట. మీడియాలో వస్తున్న రకరకాల కథనాల నేపథ్యంలో పైనుంచి రాళ్లు లాంటివి జారి పడకుండా నెట్ లాంటి మ్యాట్ ని ఏర్పాటు చేసినట్టు అధికారులు చెప్పారంట. దీంతో మీడియా వాళ్ళు ఏదో రాస్తారని అలా ఎందుకు మ్యాట్ వేసారంటూ తప్పుపట్టారట దీంతో ముఖ్యమంత్రి క్షుణ్ణంగా అక్కడ పరిస్థితులనుఅడగడం అక్కడ జరుగుతున్న తప్పిదాలన్ని ఎత్తిచూపడంతో అధికారులు వీలైనంత త్వరలో నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్ణయించారట
ప్రాంతీయ కార్యాలయాలే ఇక పై రాష్ట్ర కార్యాలయాలు
ఇక విశాఖలో రెండు రోజులు పాటు పర్యటించిన ముగ్గురు సీనియర్ ఐఏఎస్ ల బృందం కీలక నిర్ణయాలను తీసుకుందట. ముఖ్యంగా ఋషికొండపై నిర్మిస్తున్న టూరిజం భవనాలను తాత్కాలికంగా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి ఇవ్వాలని ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి టూరిజంకి తగిన ఆదేశాలు ఇవ్వాలని నిర్ణయించిందట. అదే సమయంలో ఆయా శాఖల కార్యదర్శులకు ప్రత్యేక కార్యాలయాలు కూడా గుర్తించిందట. వి.ఎం.ఆర్.డి.ఏ ఉన్న తొమ్మిది అంతస్తుల భవనంలో ప్రస్తుతం ఉన్న ఆఫీసుల్ని ఖాళీ చేసి అందులో కార్యదర్శులకు ఆఫీసుల్ని ఏర్పాటు చేయాలని భావిస్తుందట. అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఖాళీగా ఉన్న ఐదారు అంతస్తులను హెచ్ ఓ డీ లకు, ఇంకా అవసరమైతే విశాఖలో ఉన్న అన్ని ప్రాంతీయ కార్యాలయాలని రాష్ట్ర కార్యాలయాలుగా సిద్ధంచేసుకోవాలని అవసరమైతే కొత్త గదుల నిర్మాణం కానీ, లేదంటే ఉన్న గదులని అధునికరించడం లాంటివి చేసుకోవడం కానీ చేయాలని సూచించింది.
ప్రత్యేక వసతులతో నూతన గదులు..
దీంతో ఈ పనులు కూడా అత్యంత వేగంగా పూర్తి చేయాలని స్థానిక అధికారులకు చెప్పారట. విశాఖ మొదట నుంచి ఉత్తరాంధ్ర ప్రాంత ప్రాంతీయ కేంద్రంగా ఉండడంతో ఇక్కడ అన్ని శాఖలకి ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ఆ ప్రాంతీయ కార్యాలయాలు ఇకపై రాష్ట్ర కార్యాలయాలుగా మారనున్నాయి. అవసరమైతే అక్కడ రాష్ట్ర విభాగ అధిపతులకు ప్రత్యేక వసతులతో నూతన గదులను గాని లేదంటే ఉన్న వాటిని అధునీకరించడం కానీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు పోలీస్ గెస్ట్ హౌస్ ఉన్న ప్రాంతంలో డిజిపి గెస్ట్ హౌస్ m ఏర్పాటు చేసుకోవాలని సూచించారట. పోలీస్ శాఖ అందుకు సన్నద్ధం అవుతుంది. ఇలా అన్ని శాఖలకిఇప్పటికే తమ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి కాబట్టి వాటిని అప్డేట్ చేసే పనిలో పడ్డాయి.
సీఎం క్యాంప్ ఆఫీసుకు సమాంతరంగా మిగతా కార్యాలయాల ఆధునీకరణ కూడా పూర్తయి వీలైనంత త్వరలో అందరూ విశాఖకు వచ్చేలా ప్రణాళికలు జరుగుతున్నాయి. అదే సమయంలో నివాసాలకు సంబంధించి విశాఖలో ప్రస్తుతం పెద్ద స్థాయిలో అపార్ట్మెంట్స్ ఉండడం వాటిల్లో కొత్తగా నిర్మించిన అపార్ట్మెంట్స్ లో నివాసాలకి అద్దెకి తీసుకోవాలని తాత్కాలిక నిర్ణయించారట. ఇవన్నీ అమరావతి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి తగిన ఆదేశాలు జారీచే అవకాశం ఉందనీ అధికార వర్గాలు తెలిపాయి.