ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పల్నాడు జిల్లా మాచర్ల పర్యటన ఖరారైంది. ఈ విషయాన్ని సీఎంవో అధికారికంగా ప్రకటించింది. బుధవారం ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి తన నివాసం నుంచి బయలుదేరి మాచర్ల చేరుకుంటారు. స్థానికంగా ఉన్న వరికపుడిశెల ప్రాజెక్టు స్థలాన్ని సందర్శిస్తారు. అక్కడ చెన్నకేశవ కాలనీ ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభా ప్రాంగణం వద్ద ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పల్నాడు జిల్లా మాచర్ల పర్యటన ఖరారైంది. ఈ విషయాన్ని సీఎంవో అధికారికంగా ప్రకటించింది. బుధవారం ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి తన నివాసం నుంచి బయలుదేరి మాచర్ల చేరుకుంటారు. స్థానికంగా ఉన్న వరికపుడిశెల ప్రాజెక్టు స్థలాన్ని సందర్శిస్తారు. అక్కడ చెన్నకేశవ కాలనీ ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభా ప్రాంగణం వద్ద ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తారు. ఆ తరువాత ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించి తిరిగి మధ్యాహ్నం తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.
పల్నాడు ప్రజల 60ఏళ్ల కలను వరికపుడిశెల ఎత్తిపోతల ప్రాజెక్ట్ నిర్మించడం ద్వారా సాకారం చేసేందుకు సిద్దమయ్యారు. పులులు ఎక్కువగా సంచరించే అభయారణ్యం (టైగర్ ఫారెస్ట్)లో వరికపుడిశెల ఎత్తిపోతల ప్రాజెక్టు పైపులైన్ పనులు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీఎం వైఎస్ జగన్ గతంలో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖను కోరారు. ఇటీవల కేంద్రం అనుమతులు లభించడంతో వరికపుడిశెల ఎత్తిపోతల తొలి దశ పనులను రూ.340.26 కోట్లతో చేపట్టేందుకు తొలి అడుగు వేయనున్నారు. మొదటి దశలో శరవేగంగా పనులు పూర్తి చేసి పూర్తి పైప్ లైన్ల ద్వారా 24వేల ఎకరాలకు సాగు నీటిని అందించేందుకు కృషి చేయనున్నారు.