విశాఖలో నిర్వహిస్తున్న ఈ సదస్సును కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కలిసి ఆయన ప్రారభించారు. భారీ సముద్ర తీరం ఉన్నప్పటికీ రాష్ట్రంలో కొన్ని చోట్ల కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయని జగన్ అన్నారు. వాతావరణ మార్పుల కారణంగా వర్షాలు కురిసే రోజులు తగ్గిపోయాయని, కాని వర్షం కురిసినప్పుడు కుండపోత ఉంటుందనే విషయాన్ని నిపుణుల దృష్టికి సీఎం తీసుకొచ్చారు. కుండపోతగా కురిసిన వర్షాన్ని ఒక చోటు నుంచి మరో చోటుకు ప్రభావవంతంగా తరలించడమన్నది ఒక పెనుసవాల్ అని సీఎం అన్నారు.
ప్రతిష్ఠాత్మక ICID 25వ అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యమిస్తుండటం ఎంతో గర్వంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. విశాఖలో నిర్వహిస్తున్న ఈ సదస్సును కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కలిసి ఆయన ప్రారభించారు. భారీ సముద్ర తీరం ఉన్నప్పటికీ రాష్ట్రంలో కొన్ని చోట్ల కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయని జగన్ అన్నారు. వాతావరణ మార్పుల కారణంగా వర్షాలు కురిసే రోజులు తగ్గిపోయాయని, కాని వర్షం కురిసినప్పుడు కుండపోత ఉంటుందనే విషయాన్ని నిపుణుల దృష్టికి సీఎం తీసుకొచ్చారు.
కుండపోతగా కురిసిన వర్షాన్ని ఒక చోటు నుంచి మరో చోటుకు ప్రభావవంతంగా తరలించడమన్నది ఒక పెనుసవాల్ అని సీఎం జగన్ అన్నారు. ఈ దిశగా చర్యలు చేపట్టగలిగితే వ్యవసాయరంగానికి నీటి కొరత తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో దాని గురించి లోతుగా అధ్యయనం చేయాలని విజ్ఞప్తి చేశారు. సాగునీటి రంగంలో నీటి రిజర్వారయర్లు కీలక భూమిక పోషిస్తాయని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ అన్నారు.
దేశంలోని కోట్లాది రైతుల జీవనోపాధితో అవి ముడిపడి ఉన్నాయని తెలిపారు. ICID సదస్సులో ఆయన కీలక ఉపన్యాసం చేశారు. దేశంలో ప్రస్తుతం నీటి నిల్వ సామర్ధ్యం 250 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉందని తెలిపారు. 1971లో ఇది 111 బిలియన్ క్యూబిక్ మీటర్లు మాత్రమేనని వెల్లడించారు. నిర్మాణానికి భారీ వ్యయంతో పాటు పునరావాస సమస్యల కారణంగా నీటి నిల్వ సామర్ధ్యం పెంచకోవడం సవాల్‌గా మారిందని షెకావత్ అన్నారు.
కేంద్ర జలసంఘం అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ఐసిఐడిలోని 54 సభ్యదేశాలు, మరో 20అసోసియేట్ సభ్యదేశాల ప్రతినిధులు పాల్గోని వ్యవసాయరంగ సుస్థిరతకోసం ప్రత్యామ్నాయ నీటి వనరులను ఏవిధంగా వినియోగించుకోలన్న అంశాలపై చర్చిస్తారు. సంప్రదాయ నీటివనరులను అభివృద్ది చేయడం, నీటిపారుదల వ్యవస్థలను మెరుగుపరచడం, వర్షపు నీటి సంరక్షణ, పొలాల్లో వర్షపునీటిని ఒడిసి పట్టేందకు మార్గాలు, భూగర్భ జలాల పెంపుదల , మురుగునీటిని శుద్దిచేసి సాగునీటిగా వినియోగించుకునేందుకు ఉన్న మార్గాలు, అధిక దిగుబడులకోసం శుద్ద జలాల వినియోగంపై చర్చిస్తారు..
రైతు సాధికారతర అంశంపై సహకార సంస్థలు, నీటి వినియోగాదరల సంఘాల పాత్ర, వ్యవసాయ విస్తరణ సేవలు, రైతులకు ఉపయోగపడే సమాచార వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం, వ్యవసాయరంగంలో సాంకేతికను పెంపొందించడం ,వ్యవసాయ పరిశోధనలు ,ఆవిష్కరణలు, స్కాడా తదితర అంశాలపై ప్యానెల్ డిస్కషన్లు జరుగుతాయి..