అరకులోయ, అక్టోబర్ 19, (ఆంధ్రపత్రిక): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘‘క్లీన్ ఇండియా’’ క్యాంపైన్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) యూనిట్`1,2 ఆధ్వ ర్యంలో కళాశాల బోధన, బోధనేతర సిబ్బం ది కళాశాల పరిసరాలను శుభ్రం చేశారు. ఆంధ్ర విశ్వ విద్యాలయం నిర్వాహకుల ఆదేశాల మేరకు కళాశాల ప్రాంగణంలోని చెత్తాచెదారాలు, పిచ్చి మొక్కలను తొలగించారు. అదేవిధంగా అరకులోయ పట్టణంలోని మార్కెట్‌లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించి బస్తాల్లో భద్రపరిచి పెదలబుడు పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి అప్పగించారు. సుమారు 60 కిలోలకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలను బోధన, బోధనేతర సిబ్బంది తొలగించడం విశేషం. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ కె.భరత్‌కుమార్ నాయక్, సిహెచ్.రామకృష్ణ, ఎన్‌ఎస్‌ఎస్ పిఒలు పి.నాగబాబు, వై.విజయలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ కె.పద్మలత, ఐ.క్యు.ఎ.సి కో`ఆర్డినేటర్ డాక్టర్ పి.కొండబాబు, అధ్యాపకులు డాక్టర్ కె.పుష్పరాజు, పి.సుందరీరాణి, ఎం.అనితకుమారి, ఎవిఆర్.ప్రసాద్‌రావు, బి.గురయ్య, ఎన్.నాగేశ్వరరావు, ఎస్.రాజు, ఎస్.అప్పారావు, వి.కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!