చిత్తూరు పోలీసుల తీరు అమానుషం
తనపై హత్యను అడ్డుకోకుండా హత్యానేరమా..
వరుస దాడులపై సిబిఐ విచారణ జరగాలి
టిడిపి అధినేత చంద్రబాబు డిమాండ్
విజయనగరం,ఆగస్ట్ 10 (ఆంధ్రపత్రిక): తనపైన హత్య యత్నం చేసిన వారిని వదిలి, రివర్స్‌లో తనపైనే హత్యాయత్నం కేసు పెట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు పోలీసులపై మండిపడ్డారు. హత్యాయత్నం కేసు పెట్టడంపై కీలక వ్యాఖ్యలు చేశారు.ముఖ్యమంత్రి ఆదేశాలతో అంగళ్లలో విధ్వంసం సృష్టించారన్నారు. అంగళ్లులో విధ్వంసం జరగబోతుందని పోలీసులకు ముందస్తు సమాచారం ఉందన్నారు. తనను హత్య చేయాలనే వైసీపీ వాళ్ళు వచ్చారన్నారు. కమెండోలు పలుసార్లు తన ప్రాణాలు కాపాడారన్నారు. పుంగనూరులో వైసీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్లు విూదకు రావలసిన అవసరమేంటని ప్రశ్నించారు. దాడులపై సీబీఐతో విచారణ జరగాలన్నారు. చిత్తూరు ఎస్పీది అమానుష వైఖరని అన్నారు. అంగళ్లు ఘటనకు సంబంధించి వైసీపీ అరాచకాలతో పాటు పోలీసులు వ్యవహరించిన తీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చంద్రబాబు వివరించారు. తనపై చాలా సార్లు హత్యాయత్నం చేయాలని ప్లాన్ చేశారన్నారు. రోడ్డు పైకి ఆ రోజు ఉదయం వైసీపీ వాళ్ళు వస్తే ఎందుకు యాక్షన్ తీసుకోలేదని చంద్రబాబు వివరించారు. తనపై హత్యాయత్నం జరిగింది కాబట్టి వెంటనే సీబీఐ విచారణ జరగాలన్నారు. తనపై అనేకసార్లు ఈ విధంగా దాడులకు పాలడుతున్నారు కాబట్టి ఎవరూ తనను చంపడానికి ప్లాన్ చేస్తున్నారో సీబీఐ విచారణలో తేలాలన్నారు. తనపై ఎన్ఎస్జీ, విూడియా, ప్రజల సాక్షిగా జరిగిన దాడిపై సీబీఐ విచారణ జరగాలని చంద్రబాబు పేర్కొన్నారు. తనపై అనేక సార్లు ఈ విధంగా దాడులకు పాలడుతున్నారు కాబట్టి ఎవరు తనను చంపడానికి ప్లాన్ చేస్తున్నారో సీబీఐ విచారణలో తేలాలన్నారు. తనపై చాలా సార్లు దాడికి యత్నించారన్నారు. తెలుగుదేశం శ్రేణులు రొడ్డెక్కకుండా ముందస్తు అరెస్టులు చేసే పోలీసులు, అంగళ్లలో వైసీపీ శ్రేణుల్ని ఎందుకు నియంత్రించలేదని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా పుంగనూరు విధ్వంసక ఘటనలో టీడీపీ నేతలను అరెస్ట్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రశ్నించిన టీడీపీ నేతలపై కుట్రలు, దాడులు, అక్రమ కేసులు పెట్టడం పక్కన పెట్టి.. ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి తీరని అన్యాయం చేశారని అన్నారు. తన స్వార్థం, పగ కోసం మాత్రమే సీఎం జగన్ ఆలోచిస్తారని.. రాష్ట్రాభివృద్ధి గురించి మాత్రం అస్సలే ఆలోచించరని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇలా ఆలోచించడం వల్లే ఈరోజు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పడకేశాయని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగు ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు నిర్మాణం కూడా పూర్తి చేయలేదని అన్నారు. రాష్ట్రంలోని ఒక్క ఎకరాకు కూడా సాగునీటి వసతి కల్పించలేదని విమర్శించారు. ప్రాజెక్టు గేట్ల నిర్వహణ లేదని, కాలువల్లో పూడిక తీయలేదని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. జీవనాడి పోలవరాన్ని జీవం లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటి రంగానికి ఇంత ద్రోహం చేసిన సీఎం జగన్ ను చరిత్ర ఎప్పటికీ క్షమించదని వివరించారు. నేతలను అరెస్ట్ చేయించడానికి బదులుగా తాను అడిగిన ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని సీఎం జగన్‌కు సవాల్ విసిరారు.