ఇప్పటికే చిరంజీవి 2023లో రెండు సినిమాలు విడుదల చేశాడు. సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా వచ్చిన ఈయన.. ఆగస్టులో భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అయితే మెహర్ రమేష్ తెరకెక్కించిన భోళా శంకర్ మాత్రం దారుణంగా నిరాశ పరిచింది.
ఒకవైపు కుర్ర హీరోలే ఏడాదికి ఒక సినిమా చేయడానికి నానా తంటాలు పడుతుంటే.. సీనియర్ హీరోలు మాత్రం వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే చిరంజీవి 2023లో రెండు సినిమాలు విడుదల చేశాడు. సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా వచ్చిన ఈయన.. ఆగస్టులో భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అయితే మెహర్ రమేష్ తెరకెక్కించిన భోళా శంకర్ మాత్రం దారుణంగా నిరాశ పరిచింది. ఈ సినిమా ఇచ్చిన షాక్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై చాలా ఫోకస్ చేశాడు మెగాస్టార్.
నిజానికి మెహర్ సినిమా విడుదలైన నెల రోజుల్లోపే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టి సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశాడు చిరంజీవి. అయితే ఆ సినిమా దెబ్బ కొట్టడంతో కళ్యాణ్ కృష్ణ సినిమా మీద వెనక్కి తగ్గాడు మెగాస్టార్. కథ సరిగ్గా లేకపోవడంతో దాన్ని తీసి పక్కన పెట్టేసాడు. ఆ తర్వాత వశిష్ట సినిమాను ముందుకు తీసుకొచ్చాడు. నిజానికి ఇది మెగా 157 అని అనౌన్స్ చేశారు.. కానీ చివరి నిమిషంలో దాని నెంబర్ మార్చి 156గా ఫిక్స్ చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ రెండో వారంలో మొదలుకానుంది. ఇదిలా ఉంటే ఒకవైపు వశిష్ట సినిమాతో పాటే మరోవైపు ఇంకో సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకురావాలని ఆలోచిస్తున్నాడు చిరంజీవి. దీని కోసమే కథలు వింటున్నాడు.
ఈ క్రమంలోనే తమిళ దర్శకుడు పిఎస్ మిత్రన్ చెప్పిన కథ చిరంజీవికి నచ్చిందని తెలుస్తుంది. ఈయన రెండు మూడు నెలల కింద చిరంజీవిని కలిసి ఒక కథ చెప్పాడు. అయితే ఫస్ట్ ఆఫ్ బాగా నచ్చింది కానీ.. సెకండ్ హాఫ్ అంతగా నచ్చకపోవడంతో స్క్రిప్ట్ వర్క్ చేయాలని సూచించాడు మెగాస్టార్. గతంలో కార్తి సర్దార్ సినిమాలో సోషల్ మెసేజ్ బాగా చూపించడంతో ఈ దర్శకుడి కథకు చిరు ఓకే చెప్పాడు. వశిష్ట సినిమా ఎలాగూ ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ బేస్ మీద సాగుతుంది. అందులో చిరంజీవి వర్క్ తక్కువగానే ఉంటుంది. అందుకే ఆ మిగిలిన టైం లో మరో సినిమా చేయాలని చూస్తున్నాడు మెగాస్టార్. అన్ని కుదిరితే అది మిత్రన్ సినిమా అవుతుంది. మరోవైపు వివి వినాయక్ కూడా చిరంజీవి కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఎప్పుడుబయట కనిపించని వినాయక్.. చిరంజీవి వశిష్ట సినిమా ఓపెనింగ్ వీడియోలో ఉన్నాడు. దానికి కారణం మెగాస్టార్ మెప్పుకోసమే అని తెలుస్తోంది. ఏదేమైనా కూడా 2024లో చిరంజీవి నుంచి సినిమా రావడం కష్టమే. 2025 సంక్రాంతికి వశిష్ట సినిమా.. ఆ వెంటనే సమ్మర్ కు మరో సినిమా వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు అన్నయ్య. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.