ఏకాభిప్రాయాలకు వచ్చిన అంశాలను ఇరుపక్షాలు పాటించాలి
భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితి స్థిరంగా ఉంది
ఇరు పక్షాలు దౌత్య, సైనిక మార్గాల్లో నిరంతరాయంగా చర్చలను కొనసాగిస్తున్నాయి
చైనా,డిసెంబర్ 13 : అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో డిసెంబర్ 9న భారత్ దళాలతో జరి గిన ఘర్షణపై చైనా విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది.చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మాట్లాడుతూ ‘’నాకు తెలిసినంత వరకు భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితి స్థిరంగా ఉంది. ఇరు పక్షాలు దౌత్య, సైనిక మార్గాల్లో నిరంతరాయంగా చర్చలను కొనసా గిస్తున్నాయి. చైనా, భారత్‌లు ఈ దిశగా ముందడుగు వేస్తాయని ఆశిస్తున్నా’’ అని వెల్లడిరచారు. ఏకాభిప్రాయాలకు వచ్చిన అంశాలను ఇరుపక్షాలు పాటించాలని.. ఒప్పందాలను కఠినంగా అమలు చేయాలని చైనా కోరింది. భారత్-చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణపై స్పందించాలని ఆదేశ రక్షణశాఖను ఓ ఆంగ్ల వార్తా సంస్థ కోరగా.. ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. మరోవైపు ఈ ఘర్షణకు సంబంధించిన వివరాలను భారత కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంట్ ఉభయసభలకు వెల్లడిరచింది. ప్రభుత్వం తరఫున రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్లో మాట్లాడారు. సరిహద్దుల వద్ద యథాతథ పరిస్థితిని చైనా ఏకపక్షంగా మార్చాలని చూసిందని.. ఈ చర్యలను భారత సైనికులు అడ్డుకొన్నారని పేర్కొన్నారు. ఇరుపక్షాల సైనికులకు గాయాలయ్యాయని.. భారత సైన్యంలో ఎవరూ చనిపోలేదన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో రెండు దేశాలకు చెందిన పలువురు సైని కులు గాయపడ్డారు. తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్‌త్సె ప్రాంతం వద్ద ఈ నెల 9న చోటు చేసుకున్న ఈ ఘర్షణ తాలూకు వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. భారతీయులతో పోలిస్తే చైనా సైనికులు చాలా ఎక్కువ మంది ఈ ఘర్షణలో గాయపడినట్లు తెలుస్తోంది.