చంద్రబాబు మోసపూరిత మాటలతో ప్రజల మధ్యకు వస్తున్నాడని, మహిళలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు మాయలో పడి మోసపోవద్దన్నారు. చంద్రబాబు పాలనలో దోచుకోవడం.. దాచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.
”టీడీపీ అనుకూల పత్రికలు, ఛానళ్లు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయి. ఒక విధానం లేకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయి. ప్రతి ఇంటికి వైఎస్సార్‌సీపీ ప్రతినిధులు వెళ్లి కుటుంబ సమస్యలు తెలుసుకుంటున్నారు. చంద్రబాబుకి ఇలాంటి పనులు చేసే దమ్ముందా. చంద్రబాబు 10 ఏళ్ల పాలనలో ప్రజలకు ఇలాంటి సంక్షేమ పథకాలు అందించే పాలన చేశాడా” అంటూ మంత్రి బొత్స ప్రశ్నించారు.