అల్లూరి సీతారామ రాజు జిల్లా చింతూరు న్యూస్ :
చింతూరు మండల కేంద్రం లోని చట్టి గ్రామం లో కనీస మౌలిక సదుపాయాలు అయినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ,కుళాయి నీరు,పారిశుద్ధ్యం,వీధి దీపాలు,మొదలైనవి లేక గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.పరిస్థితి ఇలా ఉన్నదని,తగిన చర్యలు తీసుకొని సమస్యలను పరిష్కరించాలని సదరు సచివాలయ అధికారికి పలుమార్లు తెలిపిన పట్టించుకొకపోవడం నేటి ఈ వార్తకు నాంది.గత నాలుగు సంవత్సరములుగా గ్రామ పంచాయతీలో అనేక సమస్యలపై సదరు అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళిన కూడా సమస్యలకు పరిష్కారం లభించకపోవడం చాలా భాధాకరమని కనీస మౌలిక సదుపాయాలు లేక గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేక ప్రజలు రోగలపాలవుతున్నారు. కొందరు డ్రైనేజ్ సమస్యగూర్చి అధికారులు పరిష్కరించలేకపోవడంతో తమ సొంత డబ్బులు వెచ్చించి సచివాలయ సదరు సిబ్బంది సమక్షంలో ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకున్న ఇంకుడు గుంతలలో నీరు ఇంకాక మురికి నీరు పొరుగు ఇళ్ళలో వెళ్ళి ప్రతి రోజు ఇరుగు-పొరుగు మధ్య వాగ్వాదాలు తప్పడంలేదు.మురుగు నీటిని దారి చేసి ముందుకు పారద్రోలుటకు రోడ్డు మార్గం కావడంతో గ్రామస్తులు నానావస్తలు పడుతున్నారు.మురుగు నీరు నిల్వ ఉండిపోవడంతో ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారు. ఈ సమస్యల గురించి సదరు అధికారులకు మరియు స్పందన ద్వారా సమస్యలు తెలిపిన పరిష్కారం లభించకపోవడంతో గ్రామస్తులు గగ్గోలు పెడుతున్నారు.ఇప్పటికైనా సదరు అధికారులు స్పందించి మౌలిక సదుపాయాలను చేకూర్చి గ్రామస్తుల సమస్యలను పరిష్కరించవలసినదిగా ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు