రాజకీయాల్లో ప్రేమలు గమ్మత్తుగా ఉంటాయి. ఎవరు ఎవరితో ఉంటారో తెలియదు. నిరంతరాయంగా ఒకే వ్యక్తితో లేదా..ఒకే పార్టీతో అంటిపెట్టుకుని ఉండే ప్రేమలు కానరావు. ఉభయ తెలుగు రాష్టాల్ల్రో ఇప్పుడు రాజకీయ ప్రేమలు మారుతున్నాయి. తమ అవసరాలు, అవకాశాల మేరకే రాజకీయాల్లో ప్రేమపక్షులు ఉంటున్నారు. రాజకీయ ప్రేమబంధాలు శాశ్వతంగా నిలబడడం లేదు…ప్రేమలు..బంధాలు..విడి పోవడాలు సాధారణంగా ఉంటున్నాయి. ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటున్న వేళ.. ఎవరిపై రాజకీయ ప్రేమలు శాశ్వతంగా ఉండవని తాజా పరిస్థితులు మనకు గుర్తు చేస్తున్నాయి.వైకాపాలో ఎమ్మెల్యేగా ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి…జగన్‌తో ప్రేమను తెంపుకోవడానికి సిద్దపడ్డారు. సరిగ్గా ప్రేమికుల దినోత్సవానికి వారం రోజుల ముందునుంచే ఆయన తన ప్రేమ జగన్‌తో లేదని తేల్చేశారు. ఇకపోతే ఆ పార్టీకే చెందిన ఎంపి రఘురామకృష్ణం రాజు కూడా వైసిపితో తన ప్రేమబంధాన్ని ఎప్పుడో తెంచుకుంది. అలాగే వైసిపి కూడా అదే విధంగా రఘురామతో ప్రేమను తుంచేసుకుంది. ఇలా ఎపిలో రాజకీయ ప్రేమలు మారుతున్నాయి. ఉమ్మడి ఎపిలో కాంగ్రెస్‌లో మంత్రిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ ఆ తరవాత బిజెపిలో చేరి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. మొన్నటి వరకు ఆయన బిజెపితో ప్రేమబంధాన్ని బలంగానే కొనసాగించారు. కానీ ఇప్పుడు ఆయన తన మనసు మార్చుకుంటున్నట్లు స్పష్టం అవుతోంది. ఆయన బిజెపితో ఇక ప్రేమను కొనసాగించలేమన్న సంకేతాలను ఇస్తున్నారు. ఇలా వైసిపి,టిడిపి, బిజెపిలతో కొందరు ప్రేమను పంచుకుంటుండగా, మరికొందరు తెంచుకుంటున్నారు. ప్రజలు,రాజకీయ నాయకుల మధ్య ప్రేమబంధాలు శాశ్వతంగా ఉండడం లేదు. మోడీనే తీసుకుంటే దేశంపై ప్రేమ చాటు తున్నట్లు కనిపిస్తున్నా..ప్రజలకు మాత్రం ప్రేమకు సంబంధించిన ఫలితాలు కానరావడం లేదు. ప్రజలపట్ల ఆయనది కపట ప్రేమ అన్న విమర్శలు ఉన్నాయి. ఆదానీ,అంబానీ, కార్పోరేట్ శక్తులపై ఉన్న ప్రేమ బిజెపిలోని పెద్దలపట్ల కూడా ఉండడం లేదు. తాజాగా విశాఖ ఉక్కు కోసం ఫోక్సోతో ప్రేమలో పడ్డారు. అందుకే తమను కూడా ప్రేమించాలన్న విశాఖ ఉక్కు కార్మికులను ప్రేమించే అవకాశం లేదని తెగేసి చెప్పారు. ఆయనకు డిజిన్వెస్ట్‌మెంట్ విూద ప్రేమ ఎక్కువ. ప్రైవేట్ రంగంపై ప్రేమ ఎక్కువ. వారంతా బాగా బలపడితే అంతకన్నా ఆనందం ఉండదన్న ఆశతో ప్రేమలో పడ్డారు. ప్రభుత్వరంగాలపై అందుకే ప్రేమను వదులుకుంటున్నారు. ఆయనకు ఎల్ఐసి కన్నా దానిని కొనుగోలు చేసేవారిపై ప్రేమ ఎక్కువ… టాటాల విూద ప్రేమతో ఎయిరిండియాను మళ్లీ వారికే అప్పగించి విశాల హృదయాన్ని చాటుకున్నారు. అంతెందుకు తనను తీసుకుని వచ్చి..గద్దెనెక్కించిన అద్వానీపైనే ప్రేమను శాశ్వతంగా వదులుకున్నారు. తనను కాపాడి.. రాజకీయంగా ఉన్నత స్థానానికి తీసుకుని వచ్చినా సరే ఆయనకు అద్వానీ అంటే ప్రేమ లేదని రుజువు చేసుకున్నారు.. ఎందుకంటే పదవిపై ప్రేమ కారణంగా అద్వానీ లాంటి వారిని రాష్ట్రపతిని చేసే అవకాశం ఉన్నా పక్కన పెట్టారు. అలాగే మురళీ మనోహర్ జోషి తదితర నేతలను కూడా ప్రేమగా పక్కన పెట్టేశారు. కారణం.. వారంతా పెద్దవాళ్లు అయ్యారు కనుక ఇంటికే పరిమితం చేశారు. ఇప్పుడు అమిత్‌షాతో కొనసాగుతున్న ప్రేమకారణంగా ఇద్దరూ కలసి మనదేశ కార్పోరేట్ దిగ్గజాలతో ప్రేమలో పడ్డారు. వివిధ రాష్టాల్ల్రో ఎన్నికలు జరుగుతున్న వేళ ఆయనపై ప్రజలు ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నారో తెలియనుంది. ప్రేమ పేరుతో ప్రజలపై ధరల మోతను మోగిస్తున్నారు. జిఎస్టీ వాతలు పెడుతున్నారు. రాజకీయంగా ఎవరికి వారు తమ రాజకీయ ఎత్తుగడలతో కూడినే ఇతరులను ప్రేమిస్తున్నారు. దానివల్ల కలిగే లాభాన్ని, ప్రయోజనాలను మాత్రమే ప్రేమిస్తుంటారు. రాజకీయ నాయకుల ప్రేమలు అయితే పలు రకాలుగా ఉంటుంది.అవసరాల మేరకు ఇతరులతో తమకున్న ప్రేమలను మార్చేస్తుంటారు. ప్రధానంగా ప్రభుత్వాలకు ప్రజలపై ప్రేమ ఉండడం లేదు. అంతా స్వార్థంతో కూడిన ప్రేమ మాత్రమే కనిపిస్తోంది. తాజాగా ఇప్పుడు కెసిఆర్ తెలంగాణ ప్రజలపై చూపిన ప్రేమ ఎక్కువ కావడంతో దానిని దేశప్రజలకు కూడా పంచాలని నిర్ణయించుకున్నారు. అందుకే టిఆర్ఎస్ కాస్తా బిఆర్ఎస్గా మారి..దేశ ప్రజలకు ప్రేమను పంచబోతున్నారు. విూరంతా నన్ను ప్రేమించండని ప్రేమ సందేశాలను పంచుతున్నారు. మొన్నటి మునుగోడు ఉప ఎన్నిక ముందు దాసోజు శ్రవణ్, స్వామి గౌడ్లను మళ్లీ ప్రేమతో ఆదరించారు. అలాగే బూరనర్సయ్యగౌడ్, కోమటిరెడ్డి రాజగోపాల్‌ను బిజెపి ప్రేమించి పార్టీలోకి చేర్చుకుంది. ఇప్పుడు కెసిఆర్ అదే దారిలో మళ్లీ ఈటెల రాజేందర్, రఘునందన్ రావులపై ప్రేమ వలను విసురుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎందరితోనే ప్రేమగా ఉన్న కెసిఆర్ ఆ తరవాత వారినందరిని తన ప్రేమకు దూరం చేసుకున్నారు. మొత్తంగా రాజకీయ పార్టీలకు ఓట్ల ప్రేమ తప్ప మరోటి కానరాదు. ఓట్లు కొల్లగొట్టేందుకు ఎలాంటి ప్రేమనైనా వ్యక్తం చేస్తారు. ఎన్నికల ముందున్న ప్రేమలు ఎన్నికలయ్యాక నిలబడడం లేదు. కులాల వారీగా ప్రేమలను ప్రకటిస్తారు. ప్రజల్లో ప్రేమ ఉన్నట్లు నిరంతరాయంగా నటించడంలో మన నాయకులను మించిన వారు ఉండరు. నిజమైన ప్రేమికుల్లో సైతం అప్పుడప్పుడు కొంత విభేదాలు కనిపిస్తాయేమో కానీ..నాయకుల్లో మాత్రం అలాంటి వైఖరి కనిపించదు. ఆకాశం దించి అరచేతిలో పెడతామని ప్రమాణం చేస్తారు. మోడీతో చాలామంది రాజకీయ నాయకులు ప్రేమలో పడ్డారు. తెలంగాణ సిఎం కెసిఆర్ ఎలా ఉన్నా మోడీపట్ల ప్రేమానురాగాలతో ఏడేళ్ల బంధం కొనసాగించాక..మోడీది కపట ప్రేమ అని తెలుసుకుని..తన ప్రేమను తెంచేసుకున్నారు. ఎపి సిఎం జగన్ కూడా మోడీతో ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. కానీ ఏడేళ్ళ తరవాత కెసిఆర్ ఇప్పుడు మోడీ ప్రేమ అంతా ఉత్తిదే అని తేల్చారు. ఎపిలో జగన్ మాత్రం ప్రజల పట్ల వల్లమాలిన ప్రేమతో ఖజానాను ఊడ్చేశారు. చేతికి ఎముక లేదన్న రీతిలో.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదన్న రీతిలో…అభివృద్ది పనులకు పైసా ఖర్చు పెట్టలేని రీతిలో ప్రజలకు డబ్బులను పంచేస్తున్నారు. ప్రతి ఒక్కరి ఖాతాలో కులాలు, మతాల వారీతా నగదు జమ చేస్తూ ప్రేమను చాటుతూపోతున్నారు. అంతెందుకు ఒక్క ఆహారం వండి పెట్టడమే తరువాయి..అన్న రీతిలో అన్నీ ఉచితంగానే ఇస్తామని హావిూలు ఇచ్చి ప్రజలపై ప్రేమ కురిపిస్తున్నారు. అయితే అమరావతిపై, అమరాతి రైతులపై ప్రేమ కురింపించడం లేదు. ఎందుకంటే అమరావతి రైతులు చంద్రబాబు ప్రేమలో పడ్డారని కోపం. విశాఖ ఉక్కుపై జగన్ ప్రేమ ప్రకటించడం లేదు. మోడీవిూద ప్రేమతో దానిని పక్కన పెట్టారు. మొత్తంగా రాజకీయ ప్రేమలు శాశ్వతం కాదని తెలుసుకోవాలి.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!