చంద్రబాబు నాయుడు అరెస్టు, రిమాండ్ తో ఆంధ్రప్రదేశ్‌లో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. స్కిల్ డవలప్మెంట్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించిన తర్వాత.. ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో టీడీపీ బంద్ కొనసాగుతోంది. దీంతోపాటు..
చంద్రబాబు నాయుడు అరెస్టు, రిమాండ్ తో ఆంధ్రప్రదేశ్‌లో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. స్కిల్ డవలప్మెంట్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించిన తర్వాత.. ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో టీడీపీ బంద్ కొనసాగుతోంది. దీంతోపాటు.. ఇవాళ కూడా చంద్రబాబు వేసిన పిటీషన్లపై విచారణ కొనసాగనుంది. అంతేకాకుండా బెయిల్ కోసం హైకోర్టులో కూడా విచారణ జరగనుంది. చంద్రబాబు కేసులో ఇవాళ జరగనున్న.. జరుగుతున్న టాప్ 9 కీలక అప్డేట్స్ ఏంటో తెలుసుకోండి..
చంద్రబాబు కేసులో ఇవాళ కూడా ఉత్కంఠ పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. చంద్రబాబుని కస్టడీ కోరుతూ సీఐడీ పిటీషన్ ఏసీబీ కోర్టులో, బెయిల్ కోసం హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు కానున్నాయి. ఈ రెండు పిటీషన్లపై కూడా ఇవాళ వాడివేడిగా వాదనలు కొనసాగనున్నాయి. అదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.
ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు..ఈ నెల 22 వరకు రిమాండ్‌లో ఉండనున్నారు చంద్రబాబు..కాసేపట్లో చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేయనున్నారు..అటు ఈరోజు చంద్రబాబును నారా లోకేష్, బ్రాహ్మణి కలవనున్నారు..రోజుకు మూడు ములాఖత్‌లకే అనుమతి అంటున్నారు పోలీసులు..
చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ ఎపిసోడ్ కంప్లీట్ అయ్యింది. ఇక చంద్రబాబు బెయిల్ కోసం టీడీపీ లీగల్‌సెల్ గట్టిగా ప్రయత్నిస్తోంది. చంద్రబాబును గృహ నిర్బంధంలో ఉంచాలని ఒక పిటిషన్, బెయిల్ ఇవ్వాలని మరో పిటిషన్ వేశారు..
అయితే టీడీపీ పిటిషన్‌పై కౌంటర్ పిటిషన్ వేయనున్నారు సీఐడీ అధికారులు..అటు బాబును జ్యూడిషియల్ కస్టడీకి ఇవ్వాలని మరో పిటిషన్ వేశారు.స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబుని కీలక సూత్రధారిగా భావిస్తున్నందున ఆయన్ను ప్రశ్నించాల్సిన అవసరముందని కస్డడీ కోరుతుంది…ఈ పిటిషన్లపై ఇవాళ ఏసీబీ కోర్టులో సుధీర్ఘ విచారణ జరగనుంది.
మరోవైపు రాజమండ్రిలో సెక్షన్ 30 అమలు..రాజమండ్రి సెంట్రల్‌జైలు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. సెక్షన్ 30 అమలుతో అక్కడికి అన్యులు ఎవరూ రాకుండా కట్టడి చేశారు. ప్రత్యేక అనుమతితో మాత్రమే చంద్రబాబు కుటుంబసభ్యులు, కొందరు టీడీపీ సీనియర్ కార్యకర్తలు జైలులో ఆయన్ని పరామర్శించనున్నారు.
చంద్రబాబు రిమాండ్‌కు నిరసనగా ఇవాళ ఏపీ బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది..ఈ బంద్‌కు జనసేన, ఎమ్మార్పీఎస్ మద్దతు తెలిపాయి. టీడీపీ బంద్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు పోలీసులు. ఎక్కడికక్కడ భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
అటు టీడీపీ ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు..బంద్‌లో పాల్గొనకుండా కొనసాగుతున్న హౌస్ అరెస్ట్‌లు..ఇటు ఉమ్మడి కర్నూలు జిల్లా, అనకాపల్లి జిల్లాలో టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు..విశాఖలోనూ కొనసాగుతున్నాయి నేతల హౌస్ అరెస్ట్‌లు..అటు ఆందోళనకు చేస్తున్న టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఇదే కేసులో ఇవాళ రెండు కీలకమైన పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబుని కీలక సూత్రధారిగా భావిస్తున్నందున ఆయన్ను ప్రశ్నించాల్సిన అవసరముందని వారం రోజుల కస్డడీ కోరుతూ సీఐడీ ఇప్పటికే ఏసీబీ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్‌పై ఇవాళ వాడివేడిగా వాదన జరగనుంది.
మరోవైపు సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా చంద్రబాబుకు బెయిల్ కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేయనున్నారు.ఏపీ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. అదే సమయంలో పోలీస్ కస్టడీకు ఏసీబీ కోర్టు అనుమతిస్తుందో లేదా అనేది వేచి చూడాలి.