ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఏపీఐఐసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మొదటగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులోనే ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
ఇప్పటికే చిత్తూరు జిల్లాలో 25 చోట్ల 13,584 ఎకరా భూములు గుర్తించిన ఏపీఐఐసీ అధికారులు కూటమి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. చిత్తూరు జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజక వర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు కావడానికి రంగం సిద్ధమవుతుంది. పారిశ్రామికవేత్తలను ఆకర్షించి వారికి మౌలిక సదుపాయాలు కల్పించి వారితో పెట్టుబడులు పెట్టేలాగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఏపీఐఐసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటికే చిత్తూరు జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో సర్వే చేసిన ఏపీఐఐసీ అధికారులు ప్రాథమిక నివేదిక తయారు చేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి పంపించారు. చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి జిల్లాలో పారిశ్రామిక మార్కులు ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ దిశగా ఏపీఐఐసీ సర్వేలు మొదలుపెట్టింది. కనీసం వంద ఎకరాలకు తక్కువ కాకుండా ఒక్కో పారిశ్రామిక పార్క్ ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
చిత్తూరు జిల్లాలో 25 ప్రాంతాల్లో 13,584 ఎకరాల భూములను ఏపీఐఐసీ అధికారులు గుర్తించారు. అందులో 5,389 ఎకరాలు ప్రభుత్వ భూమి, తరువాత 6,470 ఎకరాలు అసైన్డ్, డీకేటీ భూములు, ఆ తర్వాత 1, 724 ఎకరాల పట్టా భూములను అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 100 ఎకరాల్లో 100 పారిశ్రామిక పార్కులు స్థాపించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. మొదట సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో పారిశ్రామిక పార్కుల ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.
సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయడానికి జరిపిన సర్వే ఓ కొలిక్కి వచ్చింది. చిత్తూరు జిల్లాలోని నగిరి నియోజకవర్గం లో 3,518 ఎకరాల భూములు గుర్తించిన అధికారులు చంద్రబాబు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. అందులో ఎక్కువ భూములు విజయపురం మండలంలో ఉన్నాయని, అయితే ఆ ప్రాంతంలో రోడ్లు సక్రమంగా లేవని, రైతులకు ఎంత పరిహారం ఇవ్వాలనే విషయంలో చర్చలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
పలమనేరు నియోజకవర్గంలో 2,088 ఎకరాల భూములను అధికారులు గుర్తించారు. ఈ భూముల్లో అసైన్డ్, డీకేటీ, ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయని, అదేవిధంగా పూతలపట్టు, జీడి నెల్లూరు, పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పరిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయడానికి ఇప్పటికే సర్వే పూర్తయింది. త్వరలోనే చిత్తూరు జిల్లాలో 25 ప్రాంతాల్లో ఎక్కడెక్కడ పారిశ్రామిక పార్కులు ఎర్పాటు అవుతాయి అనే విషయంలో క్లారిటీ వస్తుందని సంబంధిత అధికారులు అంటున్నారు.