టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం చంద్రబాబు, భువనేశ్వరిలకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనాలు అందించారు. శేషవస్త్రం కప్పి తీర్థప్రసాదాలు అందజేసారు ఆలయ అధికారులు. ఆ తరువాత శ్రీవారి ఆలయం ముందు చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం చంద్రబాబు, భువనేశ్వరిలకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనాలు అందించారు. శేషవస్త్రం కప్పి తీర్థప్రసాదాలు అందజేసారు ఆలయ అధికారులు. ఆ తరువాత శ్రీవారి ఆలయం ముందు చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. శ్రీవారి పాదాల చెంత పుట్టి అంచలంచెలుగా ఎదిగానన్నారు.
2003 లో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చినప్పుడు అలిపిరి వద్ద క్లైమోర్ మైన్స్ దాడికి గురైయ్యానని అప్పుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామియే నాకు ప్రాణభిక్ష పెట్టారన్నారు. కష్టం వచ్చినప్పుడు స్వామి వారిని మొక్కకుంటానన్నారు. ఈ సందర్భంగా ప్రతి రోజూ తాను శ్రీవారిని తలుస్తానన్నారు చంద్రబాబు. ధర్మాన్ని కాపాడమని స్వామి వారిని ప్రార్ధించానన్నారు.
ప్రపంచంలో భారతదేశం అగ్రస్థానంలో ఉండాలని, తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఎదగాలన్నారు. ప్రజలకు సేవ చేసే శక్తి, సామర్థ్యలు ఇవ్వాలని స్వామి వారిని వేడుకున్నానన్నారు. తన సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లడానికి శక్తిని, సామర్థ్యాన్ని, తెలివితేటలను, ఆరోగ్యాన్ని ఇవ్వాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడనని తిరుమలలో గోవింద నామ స్మరణ మాత్రమే ఉండాలన్నారు చంద్రబాబు.
కష్టాల్లో ఉన్న సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ అభిమానులు సంఘీభావం తెలిపారని అందుకు కృతజ్ఞతలు చెప్పారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు చంద్రబాబు. అనంతరం తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకొని ఉండవల్లికి పయనమయ్యారు. దాదాపు నెల రోజుల తరువాత ఉండవల్లిలోని నివాసానికి వెళ్లనున్నారు.