ఏసీబీ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో చంద్రబాబుతో సహా.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరును కూడా చేర్చింది. ఏయితే ఓపెన్ కోర్టులో వాదనలు వినాలని టీడీపీ లీగల్ టీమ్ విజ్ఞప్తి చేయగా.. దీనికి న్యాయముర్తి అంగీకరించారు. చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా బృందం వాదనలు వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఏసీబీ కోర్టులో చంద్రబాబు తన వాదనలు తానే వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు..
6 గంటలుగా కొనసాగుతోన్న టెన్షన్..
చంద్రబాబుకు రిమాండ్ విధిస్తారా, తిరస్కరిస్తారా.? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆరు గంటలుగా ఏసీబీ కోర్టు లోపల, బయటా టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్‌పై కోర్టులో సుదీర్ఘ వాదనలు సాగుతున్నాయి. PC యాక్ట్ ప్రకారం 7 రోజుల ముందుగా నోటీసులు ఇవ్వాలని, నోటీసులు ఇవ్వకుండా చంద్రబాబును అరెస్టు చేశారని ఆయన తరపు న్యాయవాది లూథ్రా అన్నారు. చంద్రబాబుపై నమోదైన అన్ని సెక్షన్లలో 409 సెక్షన్ మినహా మిగతావి 7 ఏళ్లలోపు శిక్ష పడేవే అన్నారు. 409 సెక్షన్ ఈ కేసులో చంద్రబాబుకు వర్తించదని ఆయన తెలిపారు.
తిరిగి మొదలైన వాదనలు..
రెండవ బ్రేక్ తర్వాత ఏసీబీ కోర్టులో వాదనలు తిరిగి మొదలయ్యాయి. ఇరుపక్షాల నుంచి 15 మంది మాత్రమే ఉండాలన్న జడ్జి. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలంటూ లూథ్రా వాదనలు వినిపించారు. ఇదిలా ఉంటే ఉదయం 6 గంటల నుంచి చంద్రబాబు ఏసీబీ కోర్టులోనే ఉన్నారు. కోర్టు నిర్ణయంపై ఏపీ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అరెస్టు సమయంలో సీఐడీ నిబంధనలు పాటించలేదని లూథ్రా తెలిపారు. వ్యక్తిని చుట్టుముట్టి కదలకుండా చేయడం హక్కుల ఉల్లంఘనే అన్న ఆయన దీన్ని అరెస్టుగానే పరిగణించాలన్నారు.
కోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ..
ఏసీబీ కోర్టు ఏ తీర్పునిస్తుందన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బ్రేక్ సమయం ముగిసిన తర్వాత వాదనలు మళ్లీ ప్రారంభమయ్యాయి. బ్రేక్ టైమ్‌లో అడ్వొకేట్లతో చంద్రబాబు, లోకేష్ చర్చలు జరిపారు. మరో 2 గంటలు వాదనలు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. 409 సెక్షన్, మరికొన్ని అంశాలపై వాడివేడి వాదనలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే బ్రేక్‌కు ముందు.. విరామానికి ముందు హోరాహోరీగా వాదనలు జరిగాయి. చంద్రబాబు పేరు ఎఫ్ఐఆర్లో ఎందుకు లేదని జడ్జి ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యానికి కారణాలు అడిగిన జడ్జి. చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలున్నాయా అని ప్రశ్నించారు. చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్‌ను ఏఏజీవివరించారు. ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా ఎందుకు అరెస్ట్ చేశారని లూథ్రా ప్రశ్నించారు.
ముగిసిన చంద్రబాబు వాదనలు..
ఏసీబీ కోర్టులో చంద్రబాబు వాదనలు ముగిశాయి. తనను కక్షతో అరెస్ట్ చేశారన్న చంద్రబాబు, తన అరెస్ట్ ముమ్మాటికీ అక్రమమని తెలిపారు. కోర్టులో హోరాహోరీ వాదనలు జరుగుతున్నాయి. రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించాలని సిద్ధార్థ లూథ్రా నివేధించారు. మరో రెండు గంటలు వాదనలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో విచారణ కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని శనివారం అరెస్ట్ చేసిన అధికారులు రాత్రంతా విచారించిన తర్వాత ఆదివారం ఉదయం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఏసీబీ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో చంద్రబాబుతో సహా.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరును కూడా చేర్చింది. ఏయితే ఓపెన్ కోర్టులో వాదనలు వినాలని టీడీపీ లీగల్ టీమ్ విజ్ఞప్తి చేయగా.. దీనికి న్యాయముర్తి అంగీకరించారు. చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా బృందం వాదనలు వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఏసీబీ కోర్టులో చంద్రబాబు తన వాదనలు తానే వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.. తనను అక్రంగా అరెస్ట్ చేశారని, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో నాకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు.