స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లు విచరణకు రానున్నాయి. హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేయడంతో న్యాయమూర్తుల రోస్టర్ మారుస్తూ చీఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకున్నారు. గతంలో క్వాష్ పిటిషన్లను జస్టిస్ శ్రీనివాసరెడ్డి, బెయిల్ పిటిషన్లను సురేష్ రెడ్డి విచారించేవారు. ఇప్పుడు రోస్టర్ మారడంతో క్వాష్ పిటిషన్లు, బెయిల్ పిటిషన్లు రెండూ ఈ ఇద్దరు న్యాయమూర్తుల వద్దకు కాకుండా రోస్టర్లో వేరే కేసులను కేటాయించారు.
చంద్రబాబు పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లు విచరణకు రానున్నాయి. హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేయడంతో న్యాయమూర్తుల రోస్టర్ మారుస్తూ చీఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకున్నారు. గతంలో క్వాష్ పిటిషన్లను జస్టిస్ శ్రీనివాసరెడ్డి, బెయిల్ పిటిషన్లను సురేష్ రెడ్డి విచారించేవారు. ఇప్పుడు రోస్టర్ మారడంతో క్వాష్ పిటిషన్లు, బెయిల్ పిటిషన్లు రెండూ ఈ ఇద్దరు న్యాయమూర్తుల వద్దకు కాకుండా రోస్టర్లో వేరే కేసులను కేటాయించారు.
బెయిల్ పిటిషన్లను జస్టిస్ టి. మల్లిఖార్జునరావు బెంచ్ విచారణ జరపనుంది. అలాగే క్వాష్ పిటిషన్ల బెంచ్ కూడా మారింది. హైకోర్టుకు దసరా సెలవులకు ముందు పదే పదే బెయిల్ పిటిషన్లపై వాయిదాలు పడ్డాయి. తర్వాత విచారణ వాయిదా వేశారు. వెకేషన్ బెంచ్ లో విచారణ జరిగినా న్యాయమూర్తి నాట్ బిఫోర్ అన్నారు. మరోవైపు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పై తీర్పు రావాల్సి ఉంది.
ఇవాళ కూడా విచారణ జరుగుతుందా లేకపోతే వాయిదాలు పడతాయా అన్నది సస్పెన్స్ గానే ఉంది. జస్టిస్ నూనెపల్లి హరినాథ్ కు సింగిల్ బెంచ్ కేటాయించారు. ఏసీబీ, సీబీఐ కేసుల విషయంలో 2014 వరకు నమోదైన పిటిషన్లను విచారించే బాధ్యతను అప్పగించారు. సీనియర్ జడ్జిలతో కలిసి డివిజన్ బెంచ్ పంచుకునేలారోస్టర్ నిర్ణయించారు. జస్టిస్ ఏవీ శేషసాయితో జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ యు.దుర్గాప్రసాదరావుతో జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ తో జస్టిస్ న్యాపతి విజయ్ డివిజన్ బెంచ్ లో కేసులను విచారిస్తారు.