గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీని కాపాడేందుకు ఎంతో కష్టపడ్డారు తెలుగు తమ్ముళ్ళు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల దాడులు జరిగినా, టీడీపీ కార్యకర్తలు ప్రాణాలు పోయినా సరే పార్టీ కోసం వీరోచితంగా పోరాడారు.
చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో కూడా రోడ్డెక్కి ఆందోళనలను చేసి లాఠీ దెబ్బలు తిన్నారు.
పార్టీ శ్రేణులను విస్మరించని చంద్రబాబు
ఇక ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు గెలుపు కోసం, పార్టీ విజయం కోసం జెండా చేతబట్టి ముందుకు సాగారు.అలా టీడీపీ కోసం పని చేసిన నాయకులకు, పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వం అందుబాటులో ఉండాలని, వారి సమస్యలను వినాలని భావిస్తున్న చంద్రబాబు తెలుగుదేశం పార్టీ శ్రేణుల కోసం కేంద్ర కార్యాలయంలో మంత్రులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.ఏపీ మంత్రులకు కొత్త బాధ్యతలు అప్పగించారు సీఎం చంద్రబాబు.
మంత్రులకు ఆదేశం… వారికి షెడ్యూల్
మంత్రులు పార్టీ కార్యాలయానికి వచ్చే వారి సమస్యలను వినాలని, వాటిని పరిష్కరించాలని చంద్రబాబు సూచించారు. చంద్రబాబు సూచన మేరకు నేటి నుండి టీడీపీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండనున్న మంత్రుల వివరాలు చూస్తే జులై 17 న బీసీ సంక్షేమ శాఖా మంత్రి ఎస్ సవిత, జులై 18 న మైనార్టీ శాఖా మంత్రి ఎన్ఎండి ఫరూఖ్ అందుబాటులో ఉంటారు.
పార్టీ కార్యాలయంలో మంత్రులు.. ఎప్పుడెవరంటే
జులై 19న రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, జులై 22న గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి అందుబాటులో ఉంటారు. ఇక జులై 23న గనుల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర, జులై 24 వ తేదీన రెవెన్యూ, స్టాంపులు & రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, జులై 25 వ తేదీన రాష్ట్ర కార్మికశాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు.
నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో మంత్రులు
ఇక జులై 26 వ తేదీన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, జులై 29 వ తేదీన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జులై 30 వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, జులై 31న రోడ్డు మరియు భవనాల శాఖ మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు సమాచారం అందించారు.