Pawan Kalyan Phones Nara Lokesh: రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును ఆయన కుటుంబసభ్యులు ఈ రోజు కలవనున్నారు. ఈరోజు నారా లోకేష్, బ్రాహ్మణి, పురందేశ్వరి బాబు వద్దకు వెళ్లనున్నారు. రోజుకి రెండు నుంచి మూడు ములాఖత్‌లకు మాత్రమే అనుమతించారు పోలీసులు. తెల్లవారుజూమున 2.30కి జైలులోకి వెళ్లిన చంద్రబాబుకు ప్రత్యేక వసతి కల్పించారు.
జగన్ నియంత పాలనపై కలిసి పోరాడుదామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, రిమాండ్ కు తరలించిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఫోన్లో లోకేష్ ను పరామర్శించారు. ప్రజల కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నేతని అక్రమ కేసుల్లో అరెస్ట్ చేయించి వేధించడం జగన్ కు అలవాటుగా మారిందంటూ పేర్కొన్నారు. నియంతలా జగన్ సాగిస్తున్న అరాచకాలపై అంతా కలిసి పోరాడుదామని పవన్ లోకేష్ తో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధైర్యంగా ఉండాలంటూ నారా లోకేష్ కు పవన్ సంఘీభావం తెలిపారు.
కాగా.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును ఆయన కుటుంబసభ్యులు ఈ రోజు కలవనున్నారు. ఈరోజు నారా లోకేష్, బ్రాహ్మణి, పురందేశ్వరి బాబు వద్దకు వెళ్లనున్నారు. రోజుకి రెండు నుంచి మూడు ములాఖత్‌లకు మాత్రమే అనుమతించారు పోలీసులు. తెల్లవారుజూమున 2.30కి జైలులోకి వెళ్లిన చంద్రబాబుకు ప్రత్యేక వసతి కల్పించారు. జైలులో చంద్రబాబుకు స్నేహ బ్లాక్ లో ఉండగా.. ఖైదీ నెంబర్ 7691 కేటాయించింది. ఇంటి భోజనం, మందులు ఇచ్చేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.
రాజమండ్రి జైలులో చంద్రబాబుకు వైద్య పరీక్షలు జరగనున్నాయి. రెండు రోజుల నుంచి నిద్ర లేకపోవడంతో బీసీ షుగర్‌తో పాటు.. మిగతా పరీక్షలను నిర్వహించనున్నారు వైద్యులు. సెంట్రల్ జైల్ శ్రేయ బ్లాక్ ఎదురుగా ఉన్న జైలు ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. మరోవైపు రాజమండ్రిలో సెక్షన్ 30 అమలులో ఉంది. పటిష్ట పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంది. జైలు పరిసరాలకు టీడీపీ నేతలు ఎవరూ రాకుండా ముందుగానే ఆంక్షలు విధించారు. టీడీపీ బంద్ పిలుపుతో నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు పోలీసులు.
ఇదిలాఉంటే.. చంద్రబాబు అరెస్ట్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. చంద్రబాబు అరెస్ట్, కస్టడీ పిటిషన్లను విచారించనుంది ACB కోర్టు. తనకు ఇచ్చిన రిమాండ్‌ను హౌస్ అరెస్ట్ కోరుతూ చంద్రబాబు తరపు లాయర్లు పిటిషన్ వేశారు. చంద్రబాబును 4 రోజుల కస్టడీ కోరుతూ సీఐడీ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. బాబు హౌస్ అరెస్ట్ పిటిషన్‌పై కౌంటర్ పిటిషన్ వేయనుంది సీఐడీ. ఈ పిటిషన్లపై ఇవాళ ఏసీబీ కోర్టులో సుధీర్ఘ విచారణ జరగనుంది. ఈ రెండు పిటిషన్లపై ఇవాళ విచారించి తీర్పు ఇవ్వనుంది కోర్టు.
చంద్రబాబు రిమాండ్‌కు నిరసనగా టీడీపీ ఏపీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు జనసేన, ఎమ్మార్పీఎస్ మద్దతు తెలిపాయి. టీడీపీ బంద్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు పోలీసులు. ఎక్కడికక్కడ భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
యువగళం పాదయాత్రకు బ్రేక్..
యువగళం పాదయాత్రకు కొన్నిరోజులపాటు విరామం ఇవ్వనున్నారు నారా లోకేష్. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో శుక్రవారం నాటికి కోనసీమ జిల్లా పొదలాడకు చేరుకున్నారు లోకేష్. ఇక చంద్రబాబుకు రిమాండ్ విధించడంతో పరిస్థితులు చక్కబడే వరకు పాదయాత్రను తాత్కాలికంగా బ్రేక్ ఇస్తున్నట్టు టీడీపీ శ్రేణులు తెలిపారు. పరిస్థితులు చక్కబడ్డాక లోకేష్ మళ్లీ పాదయాత్రను ప్రారంభిస్తారని వెల్లడించారు.