గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నేడు అపోలోలో కన్నుమూశారు. చంద్రమోహన్ మరణం సినీ ఇండస్ట్రీని విషాదంలోకి నెట్టింది. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు. హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన తనదైన నటనతో చెరగని ముద్ర వేశారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు చంద్రమోహన్.. ముఖ్యంగా హీరోల తండ్రి పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించారు.
ఎన్నో దశాబ్దాల పాటు తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు చంద్రమోహన్. నేటి ఉదయం 9గంటల 40 నిమిషాల సమయంలో చంద్రమోహన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నేడు అపోలోలో కన్నుమూశారు. చంద్రమోహన్ మరణం సినీ ఇండస్ట్రీని విషాదంలోకి నెట్టింది. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు. హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన తనదైన నటనతో చెరగని ముద్ర వేశారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు చంద్రమోహన్.. ముఖ్యంగా హీరోల తండ్రి పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించారు. కళాతపస్వి కే విశ్వనాధ్ దర్శకత్వంలో చంద్రమోహన్ నటించిన సీతామహాలక్ష్మీ, సిరిసిరి మువ్వా సినిమాలు చంద్రమోహన్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
దిగ్గజ దర్శకుడు కే విశ్వనాథ్ చంద్రమోహన్ కు సినిమా బంధమే కాదు.. రియల్ లైఫ్ లోనూ బంధువులు. కే విశ్వనాథ్ కు చంద్రమోహన్ కజిన్ అవుతారు. అలాగే దివగంత గాయకుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం కూడా చంద్రమోహన్ కు కజిన్ అవుతారు. ఈ ముగ్గురు దిగ్గజాలు ఇప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. విశ్వనాథ్ చనిపోయిన సమయంలో చంద్రమోహన్ తన అనుబంధం గురించి తెలిపారు. ‘‘సినిమా బంధం కంటే మా ఇద్దరి మధ్య కుటుంబ పరంగా బాంధవ్యం ఎక్కువ అని తెలిపారు చంద్రమోహన్.
కే విశ్వనాథ్ కు నేను చాలా దగ్గరివాడిని. అందుకనే, చెన్నైలో మేమిద్దం ఒకేచోట స్థలాలు కొనుకున్నాం. పక్కపక్కనే ఇళ్లు కట్టుకున్నాం. దాదాపు 25 సంవత్సరాలు పక్కపక్కనే ఉన్నాం అని చంద్రమోహన్ తెలిపారు. అలాగే ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం చంద్రమోహన్ కు తమ్ముడు అవుతారు. కే విశ్వనాథ్ అన్నయ్య అయితే బాలు తమ్ముడవుతారు అని చంద్రమోహన్ గతం ఓ సందర్భంలో తెలిపారు. కాగా కే విశ్వనాథ్ ఇదే ఏడాది కన్నుమూసిన విషయం తెలిసిందే.