ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త. అతడు చెప్పిన విధానాలను మానవ జీవితానికి అనుసరణీయం అని పెద్దల విశ్వాసం. మనిషి విజయాలను మాత్రమే కాదు.. మనుషుల మధ్య బంధాలను నిలుపుకోవడనికి, వైఫల్యానికి కారణాలకు కొన్ని ప్రధాన అంశాలను గురించి చెప్పాడు. కొన్ని రకాల అలవాట్లు ఉన్న స్త్రీ వైవాహిక జీవితానికి ఇబ్బందులు కలుగజేస్తుందని.. నిరంతరం భార్యాభర్తలు గొడవలు పడుతూ ఉంటారని చెప్పారు. స్త్రీకి ఉండకూడని ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం..
అత్యాశ గల స్త్రీలు: పురుషుల కంటే స్త్రీలకు డబ్బుపై దురాశ ఎక్కువగా ఉంటుందని ఆచార్య చాణక్యుడు చెప్పారు. డబ్బు, నగలు ఆస్తుల గురించే ఎప్పుడూ మనసులో ఆలోచిస్తారని చెప్పారు. ఇలాంటి దురాశ కొన్నిసార్లు స్త్రీలతో తప్పుడు పనులు చేస్తుంది. అది వైవాహిక జీవితానికి హానికరం.
అబద్ధం చెప్పడంలో నేర్పరి: ఆచార్య చాణక్యుడు వైవాహిక జీవితంలో విభేదాలకు ప్రధాన కారణం తమ పనిని పూర్తి చేసుకోవడానికి అబద్ధాలను ఆశ్రయించే స్త్రీలేనని పేర్కొన్నాడు. తన భర్తతో సులభంగా అబద్ధం చెబుతుంది. ఆ అబద్ధం తెలిసిన రోజున ఇరువురి మధ్య వివాదానికి దారి తీస్తుందని విశ్వాసం.
మూర్ఖత్వం: చాణక్యుడు తరచుగా స్త్రీలు తెలివితక్కువ పనులు చేస్తుంటారని.. దీంతో ఇతరులు చాలా సులభంగా స్త్రీలను తప్పుదారి పట్టించి మోసం చేస్తారని చెప్పారు. తాను మోస పోయానని తెలుసుకునే సరికే ఆమెకు, ఆమె కుటుంబానికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుందని తెలిపారు.
తానే తెలివి గల వ్యక్తిని అనే ఆలోచన: ఆచార్య చాణక్యుడు చాలామంది మహిళలు తమ భర్తల కంటే తమను తాము ఎక్కువ తెలివిగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ ఆలోచన వలన ఇబ్బందులు తలెత్తవచ్చు. అందుకే అతి తెలివి ఆలోచనలు కల్గిన మహిళలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కోపంతో ఉండే స్త్రీలు: ఆచార్య చాణక్యుడు స్త్రీలకు కోపం ఎక్కువ అని చెప్పారు. ఆమెకు ఎప్పుడు కోపం వస్తుందో ఎవరికీ తెలియదు. ఈ కారణంగా ఆమె తన భర్తతో ఎప్పుడు తగవు పడుతూ ఉంటుంది. దాంపత్య జీవితం అసంతృప్తితో సాగిపోతూ ఉంటుంది.