గుంటూరు,డిసెంబర్ 26( ఆంధ్రపత్రిక ): బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన నాయకుడు వంగవీటి మోహనరంగా అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర ప్రధాన కార్యదర్శి బందా రవీంద్రనాథ్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ బత్తుల దేవానంద్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూనె ఉమామహేశ్వరరెడ్డి కీర్తించారు. కాపు నేతలు దాసరి ప్రసాద్, కొత్తపేట సతీష్ ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేట శనక్కాయల ఫ్యాక్టరీ సెంటర్లో వంగవీటి మోహనరంగ 34వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం జరిగిన ఈ వేడుకలలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని రంగా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వంగవీటి మోహనరంగా ఒక కులానికో లేక ఒక వర్గానికో చెందిన వ్యక్తి కాదన్నారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి మాత్రమే కాక బడుగు, బలహీనుల చైతన్యదీప్తి అని వ్యాఖ్యానించారు. తరతరాలుగా పీడింపబడుతున్న పేదల పక్షాన నిలిచిన నిజమైన ప్రజా నాయకుడిని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన అనతి కాలంలోనే వంగవీటి మోహన రంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని, ఎవరికి ఏ ఆపద వాటిల్లినా నేనున్నానని ముందుకొచ్చి వారి కోసం పోరాడే మానవతావాదిగా వర్ణించారు. ఎళ్ళవేళలా బాధితులకు అండగా ఉండాలనేది రంగా ఆశయమని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు పల్లపు మహేష్‌బాబు, లంకోటి లీలా నాగ కౌండిన్య, దళిత నేతలు పరిశపోగు భరత్, మాదాసు కిరణ్, కాపు నేత డాక్టర్ సిహెచ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!