నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్..తాజాగా రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు..
ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం ఎన్ని పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా 6 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.. జీతం ఎంత అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు..
కన్సల్టెంట్ (టెక్నికల్ ఎక్స్పర్ట్ సర్వీస్ ప్రొవైడర్) పోస్టులు : 6
అర్హత..
కనీసం 60 శాతం మార్కులతో పీజీ, పీహెచ్డీ (లైఫ్ సైన్సెస్/ కెమిస్ట్రీ) ఉత్తీ్ర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి..
వయసు..
ఈ పోస్టులకు అప్లై చేసుకొనేవారికి 40 సంవత్సరాలు మించకూడదు..
జీతం..
నెలకు రూ.60,000 – రూ.80,000గా నిర్ణయించారు.
దరఖాస్తులకు చివరితేది..
ఆన్లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 30, 2024
ఇక ఈ పోస్టుల గురించి మరింత సమాచారం తెలుసుకోవాల్సిన వారు అధికార వెబ్ సైట్ ను చూడగలరు..