భీమునిపట్నం, ఫిబ్రవరి07(ఆంధ్రపత్రిక):నేటి కాలంలో విద్యమరింత క్రియాశీలంగా,పరిశోధనాత్మకoగా ఉండాలని ఆంధ్రా యూనివర్సిటీ వైస్- ఛాన్స్లర్ ప్రసాదరెడ్డి సూచించారు. ‘ఎక్స్’ రోడ్స్ వద్దగల “ది హార్బర్ ఇంటర్నేషనల్ స్కూల్”నాలగవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకళ్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ప్రశాంతమైన సువిశాలమైన ప్రాంగణంలో స్కూల్ నిర్వహిస్తున్నoదుకు స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. గౌరవ అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, డీసీసీబీ మాజీ ఛైర్ పర్సన్ అల్లు భానుమతి మాట్లాడుతూ స్కూల్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను అభినందించారు. సి.బి.ఎస్.ఇ. ను ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రవేశ పెట్టడం హర్షణీయమన్నారు. విద్యార్థులు మంచి నడవడికతో, విద్యలోరాణించి, తల్లి దండ్రులకు, సంస్థకు,దేశానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.ఈ వార్షికోత్సవంలో కరెస్పాండెంట్ యర్రా సన్యాసినాయుడు, సీఈఓ యర్రా రఘురాజ్ తదితర్లు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు సమాజానికి సందేశం అందించేవిగా అందరినీ అలరించాయి.హాజరయిన తల్లిదండ్రులు తమ పిల్లల ప్రగతిని,పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!