ఏపి నుండి రవాణా అవుతున్న గంజాయి అక్రమ దందాకు హద్దు అదుపు లేకుండా పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఒక చోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. గంజాయి స్మగ్లర్ల అక్రమ రవాణాను పట్టుకోకుండా ఉండేందుకు ఎవరికీ దొరక్కుండా కొత్త కొత్త పద్ధతులను ఫాలో అవుతున్నారు నిందితులు. రైళ్లు, బస్సులలో ప్రయాణికులతో కలిసిపోవటం, నిత్యావసర వస్తువులను సరఫరా చేసే లారీలలో పంపటం లాంటివి చేస్తున్నారు. ఇలాంటి వాహనాల్లో పంపేటప్పుడు
ఏపి నుండి రవాణా అవుతున్న గంజాయి అక్రమ దందాకు హద్దు అదుపు లేకుండా పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఒక చోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. గంజాయి స్మగ్లర్ల అక్రమ రవాణాను పట్టుకోకుండా ఉండేందుకు ఎవరికీ దొరక్కుండా కొత్త కొత్త పద్ధతులను ఫాలో అవుతున్నారు నిందితులు. రైళ్లు, బస్సులలో ప్రయాణికులతో కలిసిపోవటం, నిత్యావసర వస్తువులను సరఫరా చేసే లారీలలో పంపటం లాంటివి చేస్తున్నారు. ఇలాంటి వాహనాల్లో పంపేటప్పుడు ప్రత్యేకమైన సీక్రెట్ లాకర్లను ఏర్పాటు చేసి రహస్యంగా పంపేందుకు అనేక రహస్య మార్గాలను ఎంచుకున్నారు. ఇలాంటి రవాణాను ఎప్పటికప్పుడు చెక్ పెడుతునే ఉన్నారు పోలీసులు. అయినప్పటికీ ఏపీలో గంజాయి రవాణాలో అంతరాష్ట్ర ముఠా రెచ్చిపోతుంది.
నెల క్రితం గన్నవరం శివారులో అనుమానాస్పదంగా ఉన్న ఓ అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్న పోలీసులు వారి వద్ద కేజీల కొద్ది గంజాయిని పట్టుకున్నారు. తాజాగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) భారీ మొత్తంలో గంజాయి పట్టుకుంది. దాదాపు 731 కేజీల గంజాయిని బెజవాడ నగరు శివారులో పట్టుకుంది కేంద్ర సంస్థ. పట్టుబడ్డ గంజాయి విలువ 2.19 కోట్ల రూపాయలుగా తెలిపారు. ఈ నెల 7 వ తేదీన వైజాగ్ ఏజెన్సీ ప్రాంతాల నుండి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న క్రమంలో ఇంటిలిజెన్స్ సమాచారం మేరకు రంగప్రవేశం చేశారు అధికారులు. లారి వెనుక ట్రైలర్ భాగంలో రహస్యంగా తరలిస్తున్న అక్రమ గంజాయి మొత్తాన్ని సీజ్ చేశారు. ఈ గంజాయి రవాణాలో అంతరాష్ట్ర ముఠా హస్తం ఉన్నట్లు గుర్తించి డ్రైవర్ను అదుపులోకి తీసుకుని దీని వెనక ఎవరున్నారు అనేకోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 12 టైర్ల లారి కింద ఒక రహస్య లాకర్లో అనుమానం రాకుండా తరలించేందుకు ప్రయత్నించే క్రమంలో ఈ గంజాయి పట్టుబడినట్లు వెల్లడించారు.