ప్రజలు తలచుకుంటేనే ఏదైనా జరుగుతుంది
- మాచర్లలో బాబు నైజం బయటపడిరదని విమర్శలు
- మాచర్లలో దాడులను చంద్రబాబు రెచ్చగొట్టి చేయించారు
- సాంకేతిక సమస్యల వల్ల కౌలు పరిహారం అందించలేదు
- ఉద్యోగులకు సంబంధించి డిమాండ్లు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం..
- పెండిరగ్లో ఉన్న సమస్యలనూ పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం..
- పవన్ వ్యాఖ్యలపై మండిపడ్డ సజ్జల
అమరావతి,డిసెంబర్ 19 (ఆంధ్రపత్రిక) : సినిమా అభిమానులతో చప్పట్లు కొట్టించుకునేందుకు పవన్ కళ్యాణ్ ఏదేదో మాట్లాడుతున్నారని ప్రభుత్వ సలహా దారు సజ్జలరామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. అధికారంలో రాకుండా వైసిపిని అడ్డుకునే శక్తి పవన్‌కు లేదన్నారు. ప్రజలు ఎవరు కావాలో కోరుకుంటారని అన్నారు. ఈ మేరకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. విూడియాతో సజ్జల మాట్లాడారు. వైసీపీని అది óకారంలోకి రానివ్వనని పవన్ మాట్లాడుతున్నారు. అధికారం ఎవరికి ఇవ్వాలన్నది జనం నిర్ణయం తీసుకుంటారు. అధికారం ఎవరికీ ఇవ్వాలో తేల్చేది పవన్ కళ్యాణ్ కాదు. సంక్షేమ పథకాలు వద్దని ప్రజలు అనుకుంటే జగన్ సీఎం కాకుండా ఆపడం సాధ్యమవుతుందన్నారు. అపరిపక్వత, మూర్ఖత్వం, అజ్ఞానంతో పవన్ మాట్లాడుతున్నారు. పవన్ ఎవరి తరపున మాట్లాడుతున్నారో అర్థం అవుతుంది. చంద్రబాబు తరపున మాట్లాడుతున్నట్లు పవన్ కళ్యాణ్ ధైర్యంగా చెప్పాలి. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును పవన్‌కళ్యాణ్ ప్లలెత్తు మాట్లాడటం లేదు. ఈ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని పవన్ మాట్లాడుతున్నారు. లక్షా 30 వేల సచివాలయ ఉద్యోగాలను సీఎం జగన్ ఇచ్చారని పవన్ తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్.. చంద్రబాబు ఏజెంట్. చంద్రబాబు తయారు చేసిన స్క్రిప్టు పవన్ చదువుతున్నారు. సాంకేతిక సమస్యల వల్ల కౌలు పరిహారం అందించలేని పరిస్థితి గతం నుంచి వస్తోంది. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేకుండా సీఎం సాయం అందిస్తున్నారు. రాష్ట్రంలోకి కేఏ.పాల్ రావచ్చు.. పవన్ కళ్యాణ్ రావచ్చు.. పోటీ చేయవచ్చు. అవినీతికి హాలిడే ఇచ్చారని పవన్ కళ్యాణ్ పంచ్ డైలాగ్‌లు మాట్లాడుతున్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను పవన్ చూసి ఇలా మాట్లాడుతున్నారని సజ్జల దుయ్యబట్టారు. చంద్రబాబు నిజస్వరూపం మాచర్లలో బయటపడిరది . పబ్లిసిటీ కోసం మాచర్లలో చంద్రబాబు ఇలా దాడులు చేస్తున్నారని అర్థమవుతుంది. 7 హత్య కేసుల్లో ముద్దాయిగా ఉన్న బ్రహ్మారెడ్డిని మాచర్లకు తెచ్చిపెట్టారు. మాచర్లలో దాడులను చంద్రబాబు రెచ్చగొట్టి చేయించారు. పిన్నెల్లి కుటుంబం రెండు దశాబ్దాలుగా రాజకీయంగా ఉన్నా ఎక్కడా ఇలాంటి ఘటనలు లేవు. మాచర్ల చంబల్ లోయ అయిందని ప్రచారం చేయడం సరైంది కాదు. వైసీపీ కార్యకర్తలే తగలబెట్టారని ఎలా అనుకుంటారు.. నిజాలు విచారణలో తేలుతుంది. ఉద్రిక్తలు జరిగిన రోజు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సీఎంవోలోనే ఉన్నారు. గడప గడపకు మన ప్రభు త్వం వర్క్‌షాపు కార్యక్రమంలో ఉన్నారు. మాచర్లలో గొడవలను టీడీపీ వారే రెచ్చగొట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలే మేజర్ లబ్దిదారులు. టీడీపీ హయాంలో గిరిజన కమిటీ కూడా వేయలేదు. ప్రభుత్వంలో ప్రొవిజన్ ఉంది కాబట్టే బాపట్లలో వైసీపీ కార్యాలయానికి ప్రభుత్వ భూములు కేటా యించారు. ఉద్యోగులకు సంబంధించి డిమాండ్లు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. పెండిరగ్లో ఉన్న సమస్యలనూ పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ఉద్యోగులు, నేతలు ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాలని సజ్జల కోరారు.