నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరికి ఈ అరుదైన అవకాశం దక్కడంతో బైరెడ్డి అభిమానులు, జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూన్నారు.
వచ్చే నవంబర్ నెలలో 18వ తేదీ నుంచి 22 వ తేదీ వరకు 79వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశాలు అమెరికా దేశం న్యూయార్క్ నగరంలో జరగనున్నాయి. ఐక్యరాజ్య సమితి సమావేశాలకు భారతదేశ ప్రతినిధిగా మాట్లాడేందుకు అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్లకు ఎంపీ శబరి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ గర్వించేలా, భారతదేశానికి మంచి పేరు తెచ్చేలా అంతర్జాతీయ వేదిక పై మన సత్తా చాటుతానని అమె ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. భారత దేశ కీర్తి ఇనుమడింపజేస్తానన్నారు శబరి.