రాష్ట్రంలో సీబీఎస్ఈ అనుబంధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్ధులకు బిగ్ రిలీఫ్. పదో తరగతి విద్యార్థులకు ఈ ఏడాది రాష్ట్ర బోర్డు పరీక్షలు రాసేందుకు వెసులుబాటు కల్పించారు.
అంతర్గత పరీక్షల ఫలితాల ఆధారంగా మంత్రి నారా లోకేశ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.గత వైసీపీ ప్రభుత్వం వెయ్యి పాఠశాలలకు సీబీఎస్ఈ అనుబంధ గుర్తింపు తీసుకుంది. రాష్ట్ర బోర్డు పరీక్షలకు, సీబీఎస్ఈలకు వ్యత్యాసం ఉంటుంది. సీబీఎస్ఈ అనుబంధ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సామర్థ్యాలను తెలుసుకునేందుకు ఇటీవల విద్యాశాఖ పరీక్షలు నిర్వహించింది.
ఈ పరీక్షల్లో 64 శాతం మంది ఉత్తీర్ణులు కాలేదు. 326 పాఠశాలలో ఒక్క విద్యార్ధీ పాస్ కాలేదు. 556 పాఠశాలల్లో 25 శాతం లోపే ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఈ ఫలితాల ఆధారంగా ఈ ఏడాది సీబీఎస్ఈ విద్యార్ధులకు రాష్ట్ర బోర్డు పరీక్షలకు అనుమతించాలని మంత్రి నారా లోకేష్ నిర్ణయం తీసుకున్నారు.