5న పోలింగ్,8న ఫలితాలు:ఈసి
న్యూఢల్లీి, నవంబర్ 05 (ఆంధ్రపత్రిక): ఒడిశా, రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రలలో జరగనున్న ఉప ఎన్నికలకు ఎలక్షన్ కమీషన్ షెడ్యూల్ ప్రకటించింది. డిసెంబర్ 5 న పోలింగ్, 8 న ఫలితాలు వెలువడను న్నాయి. ఈసీ నోటిఫికేషన్ ప్రకారం డిసెంబర్ 8న గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 10 నుండి 17వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చు. నవంబర్ 18 నామినేషన్ల పరిశీలన, నవంబర్ 21న అభ్య ర్థుల ఉపసంహరణకు చివరి తేదీ అని ఈసీ వెల్లడిరచింది. డిశాలోని పదంపూర్, రాజస్థాన్‌లోని సర్దార్ షహర్, బీహార్‌లోని కుర్హానీ, ఛత్తీస్‌గఢ్‌లోని భానుప్రతాపూర్, ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జర గనుంది. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి పార్లమెంట్ స్థానానికి కూడా డిసెంబర్ 5నే పోలింగ్ జరగనుంది. ఇప్పటికే హిమాచల్, గుజరాత్ రాష్ట్రాల ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.