- వరద బాధితుల బస్సుకు మంటలు..
- 17 మంది సజీవదహం
- 10 మంది గాయాలు
కరాచీ,అక్టోబర్ 13అక్టోబర్ 13 (ఆంధ్రపత్రిక): పాకిస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సుకు మంటలు అంటుకోవడంతో దాదాపు 17 మంది సజీవదహనమయ్యారు. 10 మంది గాయపడ్డారు. బుధవారం రాత్రి కరాచీకి సమీపంలోని ఎం-9 మోటార్ వే వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ బస్సులో ప్రయాణికులంతా ఇటీవల పాక్‌ను ముంచెత్తిన వరద బాధితులు కావడం గమనార్హం. ‘ఆ బస్సులో ప్రయాణిస్తున్న వారంతా వరద బాధితులే. విపత్తు సమయంలో వారికి మోటార్ వే సమీపంలో ఆశ్రయం కల్పించారు. తిరిగి వారంతా తమ సొంత జిల్లా దాదుకు వెళుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ఉన్నారు. వెనక భాగంలో అంటుకున్న మంటలు వేగంగా వ్యాపించడంతో.. 17 మంది సజీవదహనమయ్యారు. ఆ మంటల నుంచి తప్పించుకునేందుకు కొందరు బస్సు నుంచి దూకేశారు. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు’ అని పోలీసు అధికారులు వెల్లడిరచారు. అయితే ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. ఇటీవల పాకిస్థాన్ భారీ వరదలతో విలవిల్లాడిరది. ఆ దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కురిసిన వర్షాలతో దాదాపు సగం భూభాగం వరదల్లో మునిగిపోయింది. అందులో సింధ్ ప్రావిన్స్‌లోని దాదూ జిల్లా కూడా ఒకటి. ఇదిలా ఉంటే.. ఈ ఆగస్టులో కూడా పాక్‌లో పంజాబ్ రాష్ట్రంలో ఈ తరహా ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్, బస్సు ఢీకొన్న ఘటనలో 20 మంది సజీవదహనమయ్యారు.