- 57 మంది గాయపడ్డారు.
- మృతుల్లో 27మంది చిన్నారులు
- చైల్డ్ డే కేర్ సెంటర్ వద్ద విచక్షణారహితంగా కాల్పులు
- కాల్పులకు పాల్పడిన దుండగుడు మాజీ పోలీసు అధికారిగా గుర్తింపు
బ్యాంకాక్,అక్టోబరు 6 (ఆంధ్రపత్రిక): థాయ్‌లాండ్‌లో మారణహోమం సృష్టించాడు ఓ దుండగుడు. చైల్డ్ డే కేర్ సెంటర్ వద్ద విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ దుర్ఘటనలో మొత్తం 34 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత తనను తాను కాల్పుకుని ఆత్మహత్య చేసుకున్నాడు దుండగుడు. మృతుల్లో 27మంది చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు పాల్పడిన దుండగుడు మాజీ పోలీసు అధికారిగా గుర్తించామన్నరు. కాల్పులకు పాల్పడిన దుండగుడి కోసం తొలుత పోలీసు బలగాలు ముమ్మర గాలింపు చేపట్టాయని ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు అన్ని ఏజెన్సీలను ప్రధానమంత్రి అలర్ట్ చేసినట్లు చెప్పారు. మరోవైపు.. థాయ్‌లాండ్‌లో గన్ లైసెన్స్‌లు ఎక్కువగా ఉన్నప్పటికీ కాల్పుల ఘటనలు చాలా తక్కువే. 2020లో ఆస్తి తగాదాలో కోపోద్రిక్తుడైన ఓ సైనికుడు కాల్పులు జరపటంతో 29 మంది మృతి చెందారు.. 57 మంది గాయపడ్డారు.