Samantha: అన్న అంటే ద్వేషం.. తమ్ముడంటే ప్రేమ.. సమంత తీరుకు అంతా షాక్!
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) వ్యక్తిగత జీవితం గురించి తెలిసిందే.
తన తొలి సినిమా హీరో అయిన యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్యతో దాదాపు ఏడేళ్ల పాటు సీక్రెట్ గా ప్రేమాయణం నడిపించిన సమంత.. 2017లో అతడితో ఏడడుగులు వేసింది. గోవాలో ఇరు కుటుంబ సభ్యుల నడుమ వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం అనంతరం ఎంతో అన్యోన్యంగా కనిపిస్తూ లవబుల్ కపుల్ గా గుర్తింపు సంపాదించుకున్న ఈ జంట.. ఎవరు ఊహించని విధంగా విడాకుల వైపు టర్న్ తీసుకున్నారు.
కొద్ది నెలల క్రితమే సమంత నాగచైతన్య(Naga Chaitanya)తో విడిపోయి ఒంటరిగా జీవిస్తోంది. విడాకుల అనంతరం పలుమార్లు సమంత పరోక్షంగా నాగచైతన్య పై తన ద్వేషాన్ని ప్రదర్శించింది. కానీ తాజాగా నాగచైతన్య తమ్ముడు, టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ పై ప్రేమను కురిపించింది. దీంతో సమంత తీరుకు అంత షాక్ అవుతున్నారు. అసలు ఏం జరిగిందంటే నేడు అఖిల్ అక్కినేని పుట్టినరోజు. ఈ సందర్భంగా అఖిల్ కు సినీ ప్రముఖులు, సన్నిహితులు, స్నేహితులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే సమంత కూడా అతడికి సోషల్ మీడియా ద్వారా ప్రేమగా విషెస్ తెలియజేసింది. అలాగే అక్కినేని అఖిల్(Akkineni Akhil) నటించిన `ఏజెంట్` మూవీ ఈనెల 28న విడుదల అవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేసింది. దీంతో సమంత పోస్ట్ కాస్తా వైరల్ గా మారింది. సమంత నాగచైతన్య తో విడిపోయినప్పటికీ.. వారి కుటుంబ సభ్యులతో బంధాన్ని కొనసాగించడం అందరినీ ఆకట్టుకుంటుంది.
సమంత నాగచైతన్య మధ్య గొడవలు వారి వ్యక్తిగతమని నమ్ముతున్న అక్కినేని కుటుంబ సభ్యులు సమంతతో సన్నిహిత్యం కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రానా, అఖిల్ సమంతతో క్లోజ్ గా ఉంటున్నారు. గతంలో నాగార్జున(Nagarjuna) సైతం సమంత వ్యక్తితత్వంపై ప్రశంసలు కురిపించారు. కాబట్టి, సమంతను తరచూ విమర్శించే అక్కినేని అభిమానులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా, సమంత ప్రస్తుతం శకుంతలం ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది. గుణశేఖర్ రూపొందించిన ఈ ఎపిక్ లవ్ స్టోరీ లో మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరోగా నటించాడు. ఏప్రిల్ 14న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అట్టహాసంగా విడుదల కాబోతోంది.