లండన్,అక్టోబర్ 20 (ఆంధ్రపత్రిక): బ్రిటన్‌లో తీవ్ర ఆర్థిక, రాజ కీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ కీలక పరిణా మాలు చోటుచేసుకొంటున్నాయి. తాజాగా బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేశారు.బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ రాజీనామా తర్వాత జరిగిన ఎన్నికల్లో రిషి సునాక్‌పై విజయంసాధించిన లిజ్‌ట్రస్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, ఆమె కేవలం 45 రోజుల పాటు ప్రధానిగా పదవిలో కొనసాగగలిగారు. బ్రిటన్ చరిత్రలో అత్యంత తక్కువ కాలం ప్రధానిగా ఉన్నవారు లిజ్ కావడం గమనార్హం. దేశంలో ఆర్థిక సంక్షోభంతో ఇప్పటికే పలువురు మంత్రులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.ప్రధానమంత్రి హోదాలో ఎంపీల ప్రశ్నలకు జవాబివ్వడానికి ట్రస్ బుధవారం పార్లమెంటుకు వచ్చిన సందర్భంలో కొందరు ఎంపీలు ఆమె రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత కెయిర్ స్టార్మెర్ అయితే.. ‘’ఆమె ఇంకా పదవిలో ఉన్నారెందుకు?’ అని ప్రశ్నంచగా.. ‘’నేను ఎదురొడ్డి పోరాడే ధీరవనితను. కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. బరి నుంచి పారిపోయే దాన్ని కాదు’ అంటూ దీటుగా సమాధానం ఇచ్చిన మరుసటి రోజే లిజ్‌ట్రస్ తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం.ఇటీవల లిజ్‌ట్రస్ ప్రకటించిన మినీ బడ్జెట్‌తో దేశంలో మాంద్యాన్ని చక్కదిద్దకపోగా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ మరింత గందరగోళానికి గురైంది. ఈ క్రమంలోనే ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడం, లిజ్‌పై ఒత్తిడికి కారణమైంది. ఈ పరిస్థితుల్లో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొన్న వేళ ఆమె తన పదవికి రాజీనామా చేశారు. అనం తరం ఆమె డౌనింగ్ స్ట్రీట్ బయట మీడియాతో మాట్లాడారు. తన రాజీనామా విషయాన్ని బ్రిటన్ రాజుకు తెలియపరిచానని.. తదుపరి ప్రధానిని ఎన్నుకొనేవరకు పదవిలో కొన సాగనున్నట్టు తెలిపారు. తీవ్ర ఆర్థిక, అంతర్జాతీయ అస్థితరత కొనసాగుతున్న సమయంలో తాను ప్రధాని పదవి చేపట్టానని చెప్పుకొచ్చారు లిజ్. ఉక్రెయిన్‌పై పుతిన్ యుద్ధం కొనసాగిస్తుండటం యూరప్‌తో పాటు బ్రిటన్‌కు ముప్పుగా పరిణమించిందని.. ఈ పరిస్థితి దేశ ఆర్థిక పరిస్థితిని మరింత క్షీణింపజేసిందని ఆమె పేర్కొన్నారు
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!