మాజీ క్రికెటర్ గ్రెగ్ ఛాపెల్ విశ్లేషణ
మెల్బోర్న్,ఫిబ్రవరి 4: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్టేల్రియా గెలుస్తుందని ఆ దేశ మాజీ క్రికెటర్ గ్రెగ్ ఛాపెల్ అన్నాడు. టీమిండియా ప్రస్తుతం బలహీనంగా ఉందని చెప్పాడు. ముఖ్యంగా భారత జట్టు ఎక్కువగా కోహ్లీపై ఆధారపడుతోందని..అదే ఆసీస్‌కు ప్లస్ పాయింట్ అవనుందన్నాడు. దీనికి తోడు టీమిండియాలో కీలక ఆటగాళ్లు పంత్, జడేజా, బుమ్రాలు గాయాలపాలయ్యారని..దీని కారణంగానే ఈ సారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆస్టేల్రియా సొంతం చేసుకుంటుందని జోస్యం చెప్పాడు. టీమిండియాలోని పిచ్‌లు స్పిన్ కు అనుకూలిస్తాయని..అందుకోసమే నాథన్ లియాన్ తో పాటు..ఆష్టన్ అగర్‌ను కూడా ఆస్టేల్రియా తుది జట్టులో ఆడిరచాలని ఛాపెల్ సూచించాడు. వీరిద్దరు భారత్?ను ఇబ్బంది పెడతారని చెప్పాడు. గతంలో టీమిండియా దిగ్గజం అనిల్ కుంబ్లే ఇలాగే వికెట్లు పడగొట్టాడని..ఎª`లాట్ లెగ్ బ్రేకులు బ్యాట్స్‌మన్‌కు ప్రమాదకరంగా ఉండేవన్నాడు. బాల్ మిస్ అయితే వికెట్ పడేదన్నాడు. ప్రస్తుతం జడేజా బౌలింగ్‌లో ఇలాగే జరుగుతోందన్నాడు. 19 ఏళ్ల క్రితం ఆస్టేల్రియా భారత్‌లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫి నెగ్గింది. 2004లో ఆసీస్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత 2015,2017,2020లో భారతే గెలిచింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా టెస్టు సిరీస్ గెలవాలని ఆస్టేల్రియా పట్టుదలతో ఉంది. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలోని ఆస్టేల్రియా నాలుగు టెస్టులు ఆడనుంది. రెండు జట్ల మధ్య మొదటి టెస్టు ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో ప్రారంభం కానుంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!