ప్రారంభించనున్న గవర్నర్ విశ్వభూషణ్
9 నుంచి 13 వరకు పుస్తక ప్రదర్శన
విజయవాడ,ఫిబ్రవరి 8 (ఆంధ్రపత్రిక): పుస్తకం హస్తభూషణం అన్నారు. సాంకేతికత ఎంతగా పెరిగినా పుస్తకం చదవడం వల్ల వచ్చే అనుభూతి వేరు. అది అనిర్వచనీయం. ఇప్పుడు పుస్తక పఠనం పట్ల యువతో ఆసక్తి తగ్గింది. కేవలం సెల్‌ఫోన్..గూగుల్‌తో కాలం గడిపేస్తున్నారు. ఇలాంటి వారిలో మార్పు తీసుకుని వచ్చి పుస్తక పఠనంతో కలిగే లాభాలను ఏటా వివరిస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడను మరోమారు పుస్తక ప్రదర్శన అలరించబోతోంది. ఈనెల తొమ్మిది గురువారం నుంచి 19వ వరకు విజయవాడలో పుస్తక ప్రదర్శనకు ఏర్పట్లు చేశారు. విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్లో 33వ విజయవాడ పుస్తక మహోత్సవ్ నిర్వహించనున్నట్లు బుక్ ఫెస్టివల్ సొసైటీ గౌరవాధ్యక్షులు వి.విజయకుమార్ తెలిపారు. పుస్తక మహోత్సవ్‌ను రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రారంభిస్తారు. విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రత్యేక అతిథిగా పాల్గొంటారని చెప్పారు. 13న సాయంత్రం నాలుగు గంటలకు మొగల్రాజపురంలోని పిబి సిద్దార్ద కళాశాల నుంచి బెంజిసర్కిల్ విూదుగా పుస్తక మహోత్సవ్ ప్రాంగణం వరకు పాదయాత్ర జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు పుస్తక ప్రదర్శన, పుస్తకావిష్కరణలు, సాహిత్య కార్యక్రమాలు, సదస్సులు ఉంటాయన్నారు. విద్యార్థులకు వివిధ అంశాలలో పోటీలను నిర్వహించి ముగింపు రోజున విజేతలకు బహుమతులు అందచేయనున్నట్లు తెలిపారు. పుస్తక మహోత్సవ్‌లోని అన్ని స్టాల్స్‌లో పుస్తకాలపై పది శాతం రాయితీ ఉంటుందన్నారు. ఈ ప్రదర్శనలో సుమారు 120కిపైగా పబ్లిషర్స్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారని, వీరి కోసం 250 స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!