Sabitha Indra Reddy Protest: తెలంగాణలో ఆషాఢ మాసం అంగరంగ వైభవంగా బోనాలు జరుగుతుంటాయి. పదేళ్లలో ఎలాంటి వివాదం లేకుండా సజావుగా బోనాల పండుగ జరగ్గా..
ప్రస్తుతం మాత్రం వివాదాస్పదమవుతోంది. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం మొదలుకుని గోల్కొండ బోనాలు.. మిగతా ఆలయాల్లో కూడా బోనాల నిర్వహణ విమర్శల పాలవుతోంది. బోనాలపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడంతో చాలా చోట్ల ఘర్షణలకు దారి తీస్తోంది. ముఖ్యంగా ప్రొటోకాల్ వివాదం రాజుకుంటోంది. తాజాగా మహేశ్వరంలో చెక్కుల పంపిణీ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేలపై కూర్చోని ఆందోళన చేశారు.