10మంది విద్యార్థులు మృతి
కాబూల్,నవంబర్ 30 : అఫ్గానిస్థాన్ మరోసారి బాంబు దాడులతో దద్దరిల్లింది. బుధవారం ఉత్తర అఫ్గానిస్థాన్‌లోని ఓ పాఠశాల లక్ష్యంగా ముష్కరులు దాడులకు తెగబడ్డారు.ఈ దాడిలో కనీసం 10మంది విద్యార్థులు మృతిచెందినట్టు తాలిబన్ ప్రభుత్వం వెల్లడిరచింది. ఉత్తర సమంగాన్ ప్రావిన్స్‌లోని అయ్ బాక్లో జరిగిన ఈ పేలుడు ఘటనలో పలువురికి గాయాలైనట్టు అంతర్గత మంత్రిత్వశాఖ అధికారప్రతినిధి అబ్దుల్ నఫీ టాకోర్ వెల్లడిరచారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ పేలుడు ఘటనకు బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ సంస్థా ప్రకటించలేదు.