నవంబర్ 07 (ఆంధ్రపత్రిక): స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆలియా భట్.. ఇటీవలే రణ్ బీర్ కపూర్ ను పెళ్లాడిరది. పెళ్లయిన రెండు నెలలకే గుడ్ న్యూస్ చెప్పిన ఈ జంట… తాజాగా పండంటి బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. దీంతో బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ తో పాటు పలువురు ప్రముఖుల నుంచి వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆలియా, రణ్ బీర్ లకు విషెస్ చెప్పారు. ఆలియా షేర్ చేసిన ఫొటోను చూపిస్తూ.. ’కూతుర్లు చాలా ప్రత్యేకం’ అంటూ ఆడపిల్లలపై తనకున్న మమకారాన్ని చాటుకున్నారు. మహేశ్ బాబు సినిమాల విషయాలకొస్తే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎంబి:28 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. థమన్ సంగీతం, నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక రాజమౌళి దర్శకత్వంలోనూ త్వరలోనే మహేశ్ సినిమా ప్రారంభంకానున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కున్న ఈ ఫిల్మ్ మహేశ్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ నిలవనుందని సమాచారం.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!