అక్టోబర్ 13 (ఆంధ్రపత్రిక): కన్ను గీటుతో దేశం మొత్తాన్నీ తనవైపు తిప్పుకున్నా ఇప్పటి వరకు ఒక్క హిట్ కొట్టలేకపోయింది ప్రియా ప్రకాష్ వారియర్. తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో అవకాశాలు సంపాదించింది. హిందీలోనూ కొన్ని సినిమాలకు కమిటైంది. అయితే అవేవిూ కలిసి రాలేదు. కానీ ఇప్పుడొక క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్టులో చోటు సంపాదించింది. టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ భార్య, నటి దివ్య ఖోస్లా కుమార్ 2014లో ’యారియా’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం పెద్ద హిట్టయ్యింది.
ఇప్పుడు దానికి సీక్వెల్‌ను ప్రకటించారు దివ్య. అయితే ఈసారి ఆమె డైరెక్ట్ చేయడం లేదు. లీడ్ రోల్ మాత్రమే చేస్తున్నారు. ఆమెతో పాటు యశ్ దాస్‌గుప్తా, విూజాన్ జాఫ్రీ, పెర్ల్ వి పురీ, వరీనా హుస్సేన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రియా వారియర్ కూడా ఒక ఇంపాª`ట్గంªంట్ రోల్ చేస్తోంది. త్వరలో మూవీ సెట్స్‌కి వెళ్లబోతోంది. వచ్చే యేడు మే 12న రిలీజవుతుంది. భూషణ్ కుమార్ నిర్మించే ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో చోటు దక్కడం చిన్న విషయమేవిూ కాదు. మరి ఇప్పటికైనా ప్రియ కెరీర్ మలుపు తిరుగుతుందో లేదో చూడాలి.