పిఠాపురం ఫిబ్రవరి 9 (ఆంధ్రపత్రిక) : మానవుడు తనలో అంతర్లీనంగా ఉన్న జ్ఞాన నేత్రాన్ని గుర్తించగలిగితే తద్వారా భగవంతుడిని దర్శించవచ్చునని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. పిఠాపురం కాకినాడ రోడ్ నందలి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో 3 రోజులు పాటు జరిగే పీఠం 95వ వార్షిక మహా జ్ఞాన సభలు గురువారం ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో పీఠాధిపతి తో సభలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పిఠా పురం శాసన సభ్యుడు పెండెం దొరబాబు మాట్లాడుతూ వందలాది సంవత్సరాలు గా ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని శిష్యు లకు బోధిస్తూ విశ్వమానవ శ్రేయస్సుకై పాటుపడుతున్న పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని అన్నారు. గురు శిష్యుల సంబంధం అత్యంత ప్రాధా న్యతతో కూడుకున్నదని తెలిపారు. నమ్మిన గురువుతో పరిపూర్ణమైన ప్రయా ణం చేస్తే శిష్యుని జీవితం సార్ధకమౌతుంద ని, వెల్లడిరచారు. పీఠం విశిష్టతను మారు మూల పల్లెలవరకూ విస్తరింప చేసేలా శిష్యులు కృషి చేయాలని సూచించారు. తానా చైర్మన్ తోటకూర ఈశ్వర ప్రసాద్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారం కోసం అనునిత్యం కృషి చేస్తున్న పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని అన్నారు. స్త్రీ సంక్షేమం సర్వమత సౌభ్రాతృత్వం కొరకు పీఠాధిపతులు చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ సందర్బంగా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ వర్ధినీడి సుజాత పట్టణ ఎస్.ఐ. జగన్మో హన్ రావు అగ్నిమాపక అధికారి ఎ.వేణు శ్రీపాద వల్లభ సంస్థానం దేవాల యం చైర్మన్ రెడ్డెం జనార్దన రావు వైసిపి పట్టణ అధ్యక్షుడు బొజ్జా రామయ్య గండేపల్లి బాబి కొత్తపల్లి బుజ్జి వైసీపీ పిఠాపురం నియోజకవర్గ కన్వీనర్ ప్రసాద్ జనసేన నేత పిల్లా శ్రీధర్ తదిత రులు పీఠాధిపతిని దర్శించుకున్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!