విషయం తెలుసుకొని హుటాహుటిన బయటకు వచ్చి జాయింట్ కలెక్టర్ ను లోపలికి రావాల్సిందిగా కోరిన సిబ్బంది…!
మచిలీపట్నం,నవంబర్ 16 ఆంధ్ర పత్రిక.
కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్ కి చేదు అనుభవం ఎదురయింది. మచిలీపట్నంలో మెయిన్ రోడ్ లో ఉన్న ఎంబీఆర్ షాపింగ్ మాల్ కు జాయింట్ కలెక్టర్ షాపింగ్ నిమిత్తం వెళ్లడం జరిగింది.
జాయింట్ కలెక్టర్ ని సెక్యూరిటీ గార్డు లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడం జరిగింది. విషయం ఆలస్యంగా గ్రహించిన సిబ్బంది జరిగిన తప్పిదానికి జాయింట్ కలెక్టర్ని క్షమించమని కోరి లోపలికి రమ్మని ఆహ్వానించడం జరిగింది.
సిబ్బంది, జాయింట్ కలెక్టర్ పై, సెక్యూరిటీ గార్డ్ తిట్ల దండకం మొదలెట్టాడు. సెక్యూరిటీ గార్డ్ తాగి ఉన్నాడేమో అని అనుమానం కూడా తలెత్తింది.షాక్ కు గురైన జాయింట్ కలెక్టర్ సెక్యూరిటీ గార్డ్ ప్రవర్తనపై అసహనంతో షాపింగ్ చేయకుండానే వెనుతిరగడం జరిగింది.వెంటనే ఎం బి ఆర్ షాపింగ్ యజమాన్యం
జాయింట్ కలెక్టర్ ను మరి కొందరు వస్త్ర వ్యాపారస్తుల తో కలిసి కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ను వారి కార్యాలయంలో కలవడం జరిగింది.
మచిలీపట్నం లో వస్త్ర వ్యాపారస్తులు ఉన్నత పదవిలో ఉన్న నాపైనే ఇంత దూకుడు గా వ్యవహరిస్తున్నారు అంటే, సామాన్యులపై ఇంకెంత జులుం ప్రదర్శిస్తున్నారు అంటూ జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్ అసహనానికి, తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
అనుమతులు , పార్కింగ్ స్థలం లేకుండా నిర్మాణం చేపట్టడమే కాకుండా ఇలా ప్రజలపై గుండాల మాదిరి వ్యవహరించడం పై జాయింట్ కలెక్టర్ ఎంబీఆర్ షాపింగ్ మాల్ కి నోటీసులు జారీ చేయడం జరిగింది. సంఘటన జరిగిన వెంటనే ఎం బి ఆర్ షాపింగ్ మాల్ మూసి వేయడం జరిగింది.
కొంతమంది వస్త్ర వ్యాపారులు ఉన్నతాధికారులను , వి. ఐ .పి.లను గుర్తించకపోవడం, బాధ్యతా రహితంగా వ్యవహరించడం నగరంలో సర్వసాధారణం అయిపోయిందని ప్రజానీకం అనుకుంటున్నారు.
సిబ్బంది పనితీరు ఎలా ఉంది? వారి ప్రవర్తన ఏ విధంగా ఉంది? అన్నది ముఖ్యంగా వస్త్ర వ్యాపారులు గ్రహించాలి. వారు ఖాతాదారుల పట్ల అనుసరిస్తున్న వైఖరి ఏంబిఆర్ యాజమాన్యం గ్రహించకపోవడం దురదృష్టకరం. కొంతమంది గ్రహించినా తమ సిబ్బందిని వెనక వేసుకురావడం నైజం అయిపోయింది.
జాయింట్ కలెక్టర్ స్థాయి జిల్లా అధికారిని గుర్తించకపోవడం విడ్డూరంగా ఉంది. ఇక సామాన్యులు వస్త్ర కొనుగోలుకు వెళితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో? ఆలోచించుకోవచ్చని ప్రజానీకం అనుకోవడం గమనార్హం. సెక్యూరిటీ గార్డు తాగి ఉన్నాడేమో అని అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. అతడ్ని సునిశితంగా పరిశీలించి, విచారణ చేస్తే గాని నిజానిజాలు బయటపడవు.
ఇలాంటి వస్త్ర దుకాణాలకు జిల్లాస్థాయి ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చినా తప్పులేదని ఇప్పటికైనా తగు జాగ్రత్తలు తీసుకొని, ఖాతాదారులను గౌరవించడం కనీస సంస్కారం అని తెలుసుకుంటారని ఆశిద్దాం..!